OTT Movies 2025: ఈ ఏడాది స్ట్రీమింగ్ సినిమాలను ప్రకటించిన తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్- బోల్డ్ నుంచి మైథలాజికల్ వరకు!
Aha OTT Movies And Web Series In 2025: ఓటీటీలో ఈ ఏడాది వచ్చే సినిమాలు, వెబ్ సిరీసుల జాబితాను తాజాగా ప్రకటించింది తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా. వాటిలో తెలుగు బోల్డ్ సిరీస్ నుంచి మైథలాజికల్ మూవీ వరకు ఎన్నో ఉన్నాయి. మరి తెలుగు ఓటీటీ ఆహా ప్రకటించిన 2025 సంవత్సరం సినిమాలు, సిరీస్‌లు, షోలపై లుక్కేద్దాం.

Aha OTT Movies And Web Series In 2025: ఓటీటీల హవా పెరిగిపోతుంది. అందుకే పోటా పోటీగా సరికొత్త కంటెంట్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మునుముందు స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీసులు, షోల జాబితాను ప్రకటించేస్తున్నాయి.
ఆహా ఓటీటీ సినిమాలు 2025
వాటిలో ఒకటే ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్. అచ్చ తెలుగు ఓటీటీ సంస్థగా పేరు తెచ్చుకున్న ఆహా ఇతర భాషా సినిమాలు, సిరీస్‌లను సైతం తెలుగులో అందిస్తోంది. అలాగే, ఆహా ఒరిజిల్స్ పేరుతో క్రియేటివ్ వెబ్ సిరీసులను రూపొందిస్తోంది. ఇలాంటి ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 2025 సంవత్సరంలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, సిరీస్‌లు, షోల జాబితాను ఓ వీడియో రూపంలో ప్రకటించేసింది.
- 3 రోజెస్ సీజన్ 2 ఓటీటీ
టాలీవుడ్ హీరోయిన్స్ పాయల్ రాజ్‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఓటీటీ తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్ 3 రోజెస్. 2021లో ఆహా ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‌కు ఈ సిరీస్ పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా సీజన్ 2 రానుంది. ఏ ఏడాదే ఆహాలో 3 రోజెస్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
2. చిరంజీవ ఓటీటీ
మైథలాజికల్, పురాణాల వంటి కాన్సెప్ట్‌తో ఆహా ఒరిజినల్ సిరీస్‌గా రూపొందుతోంది చిరంజీవ. ఇదివరకు రిలీజ్ చేసిన చిరంజీవ టైటిల్ పోస్టర్ అదిరిపోయింది. దీంతో చిరంజీవ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఆసక్తి నెలకొంది. ఇది కూడా ఈ ఏడాదే ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
3. హోమ్ టౌన్ ఓటీటీ- 4. చెఫ్ మంత్ర
ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అందిస్తోన్న తెలుగు ఒరిజినల్ సిరీస్ హోమ్ టౌన్ 2025లో స్ట్రీమింగ్ కానుంది. దీంతోపాటు మెగా డాటర్ నిహారిక కొణిదెల హోస్ట్‌గా వ్యవహరించిన చెఫ్ మంత్ర సీజన్ 4 కూడా ఇదే ఏడాది ప్రసారం కానుంది. చెఫ్ మంత్ర ప్రాజెక్ కె టైటిల్‌తో ఈ కుకింగ్ టాక్ షో రానున్నట్లు తెలుస్తోంది.
5. సర్కార్ 5 ఓటీటీ
బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన షో సర్కార్ మంచి హిట్ అందుకుంది. ఇప్పటివరకు సర్కార్ షో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ ఏడాది కొత్త సీజన్ రానుంది. సర్కార్ ఐదో సీజన్ 2025లో ప్రసారం కానున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో ఆహా ప్లాట్‌ఫామ్ ప్రకటించింది.
6డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్
నటుడు, దర్శకుడు, యాంకర్ ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరించిన డ్యాన్స్ రియాలిటీ షో డ్యాన్స్ ఐకాన్. దీనికి రెండో సీజన్ వచ్చేస్తోంది. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ టైటిల్‌తో వస్తున్న ఈ షో ఏ ఏడాది ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో న్యాయ నిర్ణేతలుగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, జాతి రత్నాలు చిట్టి ఫరియా అబ్దుల్లా ఉండున్నారు.
ఇలా ఆహా ఓటీటీ ఈ ఏడాది స్ట్రీమింగ్ అయ్యే 6 సినిమాలు, సిరీస్‌లు, షోలను ప్రకటించింది.
సంబంధిత కథనం