ఈ ఏడాది కన్నడంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది అజ్ఞాతవాసి మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. తాజాగా అజ్ఞాతవాసి మూవీ ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి.
అజ్ఞాతవాసి మూవీ మే 28న జీ5 ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించిన జీ5 ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది. అజ్ఞాతవాసి మూవీలో రంగాయన రఘు, పావన గౌడ, శరత్ లోహితస్వ, సిద్దు మోలిమని కీలక పాత్రలు పోషించారు. జనార్ధన్ చిక్కన్న దర్శకత్వం వహించాడు.
ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. కాన్సెప్ట్‌తో పాటు ప్రధాన పాత్రధారుల యాక్టింగ్, ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను మెప్పించాయి. విలన్ ఎవరన్నది రివీలయ్యే క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయిందంటూ థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి కామెంట్స్ వచ్చాయి. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.6 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
నల్కేరి అనే ఊళ్లో ఇరవై ఐదు ఏళ్లుగా ఒక్క క్రైమ్ జరగదు. ఆ ఊరికి గోవిందు పోలీస్ ఆఫీసర్‌గా బదిలీపై వస్తాడు. ప్రశాంతంగా ఉన్న ఆ ఊళ్లో ఓ హత్య కలకలాన్ని రేపుతుంది. ఊరి పెద్ద శ్రీనివాసయ్య దారుణంగా హత్యకు గురవుతాడు. ఈ కేసు గోవిందు ఛాలెంజింగ్‌గా తీసుకుంటాడు. పంకజ, రోహిత్‌లు శ్రీనివాసయ్యను హత్య చేశారని గోవిందు అనుమానిస్తాడు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన రోహిత్ ఆ ఊరికి ఎందుకు వచ్చాడు? పంకజతో అతడికి ఉన్న సంబంధం ఏమిటి? శ్రీనివాసయ్య హత్యకు 1970లో ఆ ఊళ్లో జరిగిన ఓ సంఘటనకు ఉన్న సంబంధమేమిటి? అన్నదే ఈ మూవీ కథ.
నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ కన్నడ మూవీకి చరణ్ రాజ్ మ్యూజిక్ అందించాడు. అజ్ఞాతవాసి కంటే ముందు పౌడర్, గుల్టో అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు జనార్ధన్ చిక్కన్న.
సంబంధిత కథనం