OTT Horror Movie Aghathiyaa Release In Two Platforms: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రాశీ ఖన్నా ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు ఏం చేయట్లేదు. ఎక్కువగా హిందీ, తమిళ భాషల్లోనే మూవీస్ చేస్తూ బిజీగా ఉంటోంది. ఓటీటీ వెబ్ సిరీస్‌లలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా హారర్ మూవీస్‌పై ఫోకస్ పెడుతోంది. వాటిని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.
ఇదివరకే తమన్నాతో అరణ్మనై 4 తెలుగులో బాక్ సినిమాలో నటించిన రాశీ ఖన్నా రీసెంట్‌గా మరో తమిళ హారర్ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆ మూవీనే అగత్యా. తమిళ హిస్టారికల్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన అగత్యాలో తమిళ హీరో జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలు పోషించారు. వీరితోపాటు యోగిబాబు, వీటీ గణేష్ కామెడీ రోల్స్ చేశారు.
అగత్యా సినిమాకు రైటర్ పా విజయ్ కథ అందించి, దర్శకత్వం వహించారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఐసరి గణేష్, అనీష్ అర్జున్ దేవ్ అగత్యా సినిమాను నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన అగత్యా గత నెల ఫిబ్రవరి 28న థియేటర్లలో విడుదలైంది. తమిళంలో తెరకెక్కిన అగత్యా తెలుగు, హిందీ భాషలో కూడా థియేటర్లలో విడుదలైంది.
అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అగత్యా మూవీ. సుమారు రూ. 25 కోట్ల వరకు బడ్జెట్‌తో అగత్యా సినిమాకు ఖర్చు చేస్తే బాక్సాఫీస్ బరిలో నిలిచి కేవలం రెండున్న కోట్ల రూపాయలలోపే కలెక్షన్స్ సాధించగలిగింది. దీంతో ఇప్పుడు నెల కాకుండానే అంటే 28 రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది అగత్యా.
మార్చి 28న సన్ నెక్ట్స్‌లో అగత్యా ఓటీటీ రిలీజ్ కానుందని కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. అయితే, ఇప్పుడు మరో ఓటీటీలోకి అదే మార్చి 28న అగత్యా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. మరో ఓటీటీ ప్లాట్‌ఫామే అమెజాన్ ప్రైమ్. శుక్రవారం (మార్చి 28) నుంచి సన్ ఎన్ఎక్స్‌టీ, అమెజాన్ ప్రైమ్‌లలో అగత్యా ఓటీటీ రిలీజ్ కానుందని మింట్ తెలిపింది. దీనికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది.
మార్చి 28న మిడ్‌నైట్ (అర్థరాత్రి) 12 గంటల నుంచి అగత్యా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. అది కూడా తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా అగత్య ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇలా మూడు భాషల్లో రెండు ఓటీటీల్లో అగత్యా మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. మరి రాశీ ఖన్నా, జీవా, అర్జున్ సర్జా నటించిన అగత్యా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే, అగత్యా సినిమాలో జీవా రెండు పాత్రలు పోషించినట్లు సమాచారం. ఓ మిస్టీరియస్ ప్లేస్‌లోకి రీసెర్చ్ కోసం వెళ్లిన ఓ బృందానికి ఎదురైన సంఘటనలతోనే అగత్యా సినిమా సాగుతుంది. కాగా, 2 గంటల 16 నిమిషాల రన్ టైమ్ ఉన్న అగత్యా సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 10కి 5 రేటింగ్ మాత్రమే వచ్చింది. అంటే, మరికొన్ని గంటల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అగత్యా యావరేజ్‌గా నిలిచినట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనం