Unreleased OTT Movies: థియేటర్స్‌లో రిలీజై చాలా రోజులైన ఓటీటీలోకి రాని స్టార్స్ మూవీస్ ఇవే
Akhil Agent: స్టార్ హీరోలు నటించిన కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలై ఏడాది దాటినా ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. ఆ సినిమాలు ఏవంటే?
Akhil Agent: ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. నిర్మాతలకు ఓటీటీ అన్నది మంచి లాభసాటి మార్గంగా మారిపోయింది. థియేటర్, ఓటీటీ రిలీజ్‌కు మధ్య గ్యాప్ కూడా తగ్గుతూ వస్తోంది. స్టార్ హీరోల సినిమాలు కూడా థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోన్నాయి. కానీ కొందరు స్టార్స్ నటించిన కొన్ని సినిమాలు మాత్రం థియేటర్లలో రిలీజై ఏడాది గడుస్తోన్న ఓటీటీలోకి మాత్రం రాలేదు. ఆ సినిమాలు ఏవంటే...
ట్రెండింగ్ వార్తలు
అఖిల్ ఏజెంట్…
అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి ఏడు నెలలు దాటిపోయింది. అయినా ఈ సినిమా ఇప్పటివరకు ఓటీటీలో మాత్రం రిలీజ్ కాలేదు. ఏజెంట్‌పై ఉన్న హైప్ కారణంగా భారీ ధరకు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ దక్కించుకున్నది.
థియేటర్‌లో ఏజెంట్ డిజాస్టర్‌గా నిలవడం, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య గొడవల ఎఫెక్ట్ ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై బలంగా పడింది. ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై సోనీ లివ్ రెండు సార్లు అధికారిక ప్రకటనలు చేసింది. కానీ సినిమా మాత్రం రిలీజ్ కాలేదు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సంబంధిచిన కోర్టు ఇష్యూస్ పరిష్కారమయ్యే అవకాశం లేకపోవడంతో ఏజెంట్ ఓటీటీలో రిలీజ్ కావడం అనుమానమేనని టాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి.
నయనతార కనెక్ట్…
నయనతార కనెక్ట్ థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టిన ఓటీటీలో మాత్రం రిలీజ్ కాలేదు. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్ల విడుదలైంది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ మూవీని నిర్మించాడు. కనెక్ట్ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సినిమా మాత్రం ఇప్పటివరకు ఓటీటీ కనిపించలేదు.
ది కేరళ స్టోరీ...
ఈ ఏడాది మోస్ట్ కాంట్రవర్సీయల్ మూవీగా నిలిచిన ది కేరళ స్టోరీ థియేటర్లలో 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. థియేటర్లలో నిర్మాతలకు లాభాల పంటను పడించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీని కొనడానికి ఓటీటీ సంస్థలేవి ముందుకు రాలేదు. సెన్సిటివ్ కంటెంట్ కావడంతో వివాదాలు తలెత్తుతాయనే భయంతోనే ఓటీటీ సంస్థలు కేరళ స్టోరీని రిలీజ్ చేయడానికి భయపడినట్లు వార్తలొచ్చాయి.