Agent OTT release date: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న అఖిల్ ‘ఏజెంట్’ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్-agent ott release date akhil action movie set to stream on sony liv ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Agent Ott Release Date Akhil Action Movie Set To Stream On Sony Liv

Agent OTT release date: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న అఖిల్ ‘ఏజెంట్’ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 22, 2023 04:12 PM IST

Agent OTT release date: అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఐదు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‍కు ఈ మూవీ వచ్చేస్తోంది.

Agent OTT release date: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న అఖిల్ ‘ఏజెంట్’ సినిమా.. డేట్ ఫిక్స్
Agent OTT release date: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న అఖిల్ ‘ఏజెంట్’ సినిమా.. డేట్ ఫిక్స్

Agent OTT release date: యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‍‍ఫామ్ అధికారికంగా ఖరారయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఏజెంట్ మూవీ డిజాస్టర్‌ అయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ స్పై మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఓటీటీలోకి వచ్చేందుకు కూడా ఈ మూవీకి బాగా ఆలస్యమైంది. అయితే, మొత్తానికి ఏజెంట్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‍ఫామ్ ఖరారయ్యాయి. ఆ వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

ఏజెంట్ సినిమా సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్ 29వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని సోనీ లివ్ నేడు అధికారికంగా వెల్లడించింది. ఓటీటీ రిలీజ్ కోసం ఓ ట్రైలర్‌ను కూడా పోస్ట్ చేసింది. “నిరీక్షణ ముగిసింది. రసవత్తరమైన వైల్డ్ రష్‍కు సిద్ధంగా ఉండండి. మమ్మూటి, అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్ ప్లాట్‍పామ్‍లో సెప్టెంబర్ 29 తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది” అని సోనీ లివ్ ట్వీట్ చేసింది. థియేటర్లలో రిలీజ్ అయిన సుమారు ఐదు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది.

ఏజెంట్ సినిమాలో అఖిల్ హీరోగా చేయగా.. మలయాళ స్టార్ నటుడు మమ్మూటి కీలకపాత్ర పోషించారు. ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్‍గా చేశారు. డినో మోరియా, విక్రమ్‍జీత్, డెంజిల్ స్మిత్ కీలకపాత్రల్లో కనిపించారు. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

అయితే, ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందింది. ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టడడంలో విఫలమైంది. కొన్ని ఆర్థికపరమైన విషయాల వల్ల ఓటీటీ రిలీజ్ కూడా వాయిదా పడుతూ వచ్చింది. సోనీ లీవ్ ఈ సినిమా స్ట్రీమింగ్‍ను ఆలస్యం చేస్తూ వచ్చింది. దీంతో ఏజెంట్ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అందరూ ఎదురుచూశారు. ఇప్పుడు ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్ 29న ఏజెంట్ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.