Siddharth: కొరియన్ రీమేక్‌లో సిద్ధార్థ్, అదితీరావ్ - టైటిల్ ఇదే - అనౌన్స్‌మెంట్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్
Siddharth: లవ్ బర్డ్స్ సిద్దార్థ్, అదితీరావ్ హైదరీ తెలుగులో ఓ లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హరిలో రంగహరి పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నాడు.
Siddharth: మహాసముద్రం తర్వాత లవ్ బర్డ్స్ సిద్ధార్థ్, అదితీరావ్ హైదరీ తెలుగులో మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా టైటిల్ సోమవారం రివీలైంది. బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ మూవీకి హరిలో రంగహరి అనేటైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నాడు. కొరియన్ మూవీ రీమేక్‌గా హరిలో రంగహరి మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఓబేబీ ప్రొడ్యూసర్ సునీత తాటి హరిలో రంగహరి మూవీని నిర్మిస్తోంది.
అనౌన్స్‌మెంట్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్...
హరిలో రంగహరి అనౌన్స్‌మెంట్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. ఈ విషయాన్ని సోమవారం నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. హరిలోరంగహరి పోస్టర్‌ను తమ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో నెట్‌ఫ్లిక్స్ పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కొద్ది సేపటి తర్వాత ఈ ట్వీట్ డిలీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కానందునే పోస్టర్‌ను నెట్‌ఫ్లిక్స్ డిలీట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
మహాసముద్రం తర్వాత...
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాలో సిద్ధార్థ్, అదితీరావ్ హైదరీ ఫస్ట్ టైమ్ కలిసి నటించారు. మహాసముద్రం షూటింగ్‌లోనే ఈ జంట మధ్య ప్రేమ చిగురించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి. సిద్ధార్థ్, అదితీ చెట్టపట్టాలేసుకొని తిరుగుతూ పలుమార్లు మీడియా కంట పడ్డారు. సిద్ధార్థ్ చిన్నా లో అదితీరావ్ నటించకపోయినా ఈ సినిమా ప్రమోషన్స్‌లో కనిపించడం హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా వీరిద్దరు హరిలో రంగహరి సినిమాలో కలిసి నటించనుండటం ఆసక్తికరంగా మారింది. హరిలో రంగహరి సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానున్నట్లు తెలిసింది.
చిన్నాతో సిద్ధార్థ్ పెద్ద హిట్…
ఇటీవలే చిన్నా సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత సిద్ధార్థ్ పెద్ద హిట్ అందుకున్నాడు. సోషల్ మెసేజ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో సిద్ధార్థ్ యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. చిన్నా సినిమాను స్వయంగా సిద్ధార్థ్ నిర్మించాడు. మరోవైపు మణిరత్నం సినిమాలతో సౌత్ ప్రేక్షకులకు చేరువైంది అదితీరావ్ హైదరీ. మణిరత్నం చెలియా, నవాబ్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో సమ్మోహనంతో ఎంట్రీ ఇచ్చిన అదితీరావ్...నాని వీ, వరుణ్ తేజ్ అంతరిక్షం సినిమాలు చేసింది. ప్రస్తుతం విజయ్ సేతుపతిలో కలిసి గాంధీ టాక్స్ అనే మూవీ మూవీ చేస్తోంది అదితీరావ్ హైదరీ.
దయా వెబ్‌సిరీస్‌తో సక్సెస్...
శ్రీవిష్ణు హీరోగా నటించిన ప్రేమ ఇష్క్ కాదల్ మూవీతో 2013లో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు పవన్ సాదినేని. కొన్ని సినిమాలు చేసినా ఆశించిన విజయాలు మాత్రం దక్కలేదు. ఇటీవలే జేడీ చక్రవర్తితో దయా అనే వెబ్‌సిరీస్ చేశాడు. ఈ సిరీస్ మాత్రం అతడికి డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చిపెట్టింది.