Vijay Devarakonda Sandeep Vanga: అర్జున్ రెడ్డి కాంబో వ‌న్స్‌మోర్ - విజ‌య్, సందీప్ వంగాల‌తో మూవీ ప్లాన్ చేస్తోన్న మైత్రీ-after arjun reddy vijay devarakonda sandeep reddy vanga reunite once again details here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  After Arjun Reddy Vijay Devarakonda Sandeep Reddy Vanga Reunite Once Again Details Here

Vijay Devarakonda Sandeep Vanga: అర్జున్ రెడ్డి కాంబో వ‌న్స్‌మోర్ - విజ‌య్, సందీప్ వంగాల‌తో మూవీ ప్లాన్ చేస్తోన్న మైత్రీ

HT Telugu Desk HT Telugu
Aug 31, 2023 05:54 AM IST

Vijay Devarakonda Sandeep Vanga: అర్జున్ రెడ్డి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ సందీప్ వంగా కాంబినేష‌న్‌లో మ‌రో మూవీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.ఈ కాంబినేష‌న్‌పై మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత ర‌విశంక‌ర్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌
విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Vijay Devarakonda Sandeep Vanga: అర్జున్ రెడ్డి త‌ర్వాత విజ‌య్ దేవ‌రకొండ‌, డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేష‌న్ మ‌రోసారి వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తోన్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తోన్న ఖుషి మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ శుక్ర‌వారం (సెప్టెంబ‌ర్ 1న‌) ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా అర్జున్ రెడ్డి కాంబోపై మైత్రీ మూవీస్ అధినేత ర‌విశంక‌ర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. డియ‌ర్ కామ్రేడ్, ఖుషి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మూడో మూవీ చేయాలంటే ఎలాంటి సినిమా చేస్తారని ప్రమోషన్స్‌లో అడిగిన ప్ర‌శ్న‌కు ర‌విశంక‌ర్ చెప్పిన స‌మాధానం ఆస‌క్తిక‌రంగా మారింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్ వంగా కాంబోలో ఓ మూవీ ఫిక్స్ చేసేందుకు సిన్సియ‌ర్ గా ట్రై చేస్తున్నామ‌ని ర‌విశంక‌ర్ అన్నాడు.

వీళ్లిద్ద‌రు క‌లిస్తే సాఫ్ట్ జోన‌ర్‌లో సినిమా ఉండ‌ద‌ని, డెఫినెట్‌గా షాకింగ్ కాన్సెప్ట్‌తో అంద‌రిని ఈ సినిమా స‌ర్‌ప్రైజ్ చేస్తుందని ర‌విశంక‌ర్ అన్నాడు. మైత్రీ మూవీ ర‌విశంక‌ర్ చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌ని అర్జున్ రెడ్డి టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. ఈసినిమాతోనే విజ‌య్ స్టార్ లీగ్‌లో చేరిపోయారు.

రెబెల్ ఆటిట్యూడ్ ఉన్న ల‌వ‌ర్ బాయ్ పాత్ర‌లో విజ‌య్ యాక్టింగ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాతో సందీప్ వంగా పేరు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో మారుమోగింది. అర్జున్ రెడ్డి సినిమాను క‌బీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేశాడు సందీప్ వంగా.

షాహిద్ క‌పూర్ హీరోగా న‌టించిన క‌బీర్ సింగ్ 200 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం ర‌ణ్‌భీర్ క‌పూర్‌తో యానిమ‌ల్ మూవీ చేస్తోన్నాడు సందీప్ వంగా. మ‌రోవైపు ఖుషి త‌ర్వాత గౌత‌మ్ తిన్న‌నూరి, ప‌ర‌శురామ్‌ల‌తో సినిమాలు చేయ‌బోతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

IPL_Entry_Point