Ips Officer Biopic: 12th ఫెయిల్‌కు మించిన బయోపిక్ - తెరపైకి మరో ఐపీఎస్ ఆఫీసర్ కథ
Ips Officer Biopic: 12th ఫెయిల్ సక్సెస్ తర్వాత మరో ఐపీఎస్ ఆఫీసర్ జీవితంతో బాలీవుడ్‌లో బయోపిక్ మూవీ రాబోతోంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ రామ్ గోపాల్ నాయక్ జీవిత కథతో తెరకెక్కునున్న సినిమాలో ఇమ్రాన్ జాహిద్ టైటిల్ పాత్రలో కనిపించబోతున్నాడు.
Ips Officer Biopic: విక్రాంత్ మస్సే హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ 12th ఫెయిల్ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని అందుకున్నది. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 70 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా 12th ఫెయిల్ మూవీ తెరకెక్కింది. 12వ తరగతి ఎగ్జామ్స్‌లో ఫెయిలైన మనోజ్‌కుమార్ ఎన్నో కష్టాల కోర్చి ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎలా సెలక్ట్ అయ్యాడన్నది డైరెక్టర్ విధు వినోద్ చోప్రా ఎమోషనల్‌గా ఈ సినిమాలో చూపించిన తీరుకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
రామ్‌గోపాల్ నాయక్ బయోపిక్...
12th ఫెయిల్ మూవీ స్ఫూర్తితో మరో ఐపీఎస్ ఆఫీసర్ బయోపిక్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై రాబోతోంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌లో డీసీపీగా పనిచేస్తోన్న ఐపీఎస్ ఆఫీసర్ రామ్ గోపాల్ నాయక్ జీవితాన్ని వెండితెరపైకి తీసుకురానున్నారు. క్రికెట్ బుకీ సంజీవ్ చావ్లా అరెస్ట్‌లో రామ్ గోపాల్ కీలకంగా వ్యవహరించారు. సీబీఎస్‌పీ పేపర్ లీక్ కేసును ఛేదించారు. తన సుధీర్ఘ కెరీర్‌లో ఎన్నో కేసులను సాల్వ్ చేసి గ్యాలెంటరీ అవార్డును అందుకున్నాడు రామ్ గోపాల్ నాయక్.
ఇమ్రాన్ జైద్...
ఈ బయోపిక్‌లో రామ్ గోపాల్ నాయక్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ జాహిద్ కనిపించబోతున్నట్లు సమాచారం. మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన జన్నత్ 2, జిస్మ్ 2తో పాటు బాలీవుడ్‌లో పలు సినిమాలు చేశాడు ఇమ్రాన్ జాహిద్ . గత ఏడాది రిలీజైన అబ్ దిల్లీ దూర్ నహీన్ సినిమాలో ఇమ్రాజ్ జైద్ బీహారి ఐఏఎస్ ఆఫీసర్ అభయ్ శుక్లా పాత్రలో కనిపించాడు.
పోలీస్ ఆఫీసర్స్ కష్టాలు...
రామ్‌గోపాల్ నాయక్ బయోపిక్‌కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతోన్నట్లు తెలిసింది. తన జీవితం వెండితెరపైకి రావడం పట్ల రామ్‌గోపాల్ నాయక్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఎవరి ఇమ్రాన్ జైద్...ప్రజా రక్షణలో తనలాంటి పోలీస్ ఆఫీసర్స్ పడుతోన్న కష్టాన్ని రియలిస్టిక్‌గా ఈ సినిమాలో చూపిస్తారనే నమ్మకముందని, సొసైటీకి మంచి మెసేజ్‌ను అందించే మూవీగా నిలుస్తుందని రామ్‌గోపాల్ నాయక్ అన్నాడు.
12 ఏళ్ల కెరీర్‌లో...
జన్నత్ 2 మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇమ్రాన్ జాహిద్ 12 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం ఐదు సినిమాలు మాత్రమే చేశాడు. రామ్‌గోపాల్ నాయక్ బయోపిక్‌తో తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనే నమ్మకముందని ఇమ్రాన్ జాహిద్ తెలిపాడు. త్వరలోనే ఈ బయోపిక్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు తెలిసింది. ఆ ఈవెంట్‌లోనే దర్శకనిర్మాతలు ఎవరన్నది రివీల్ చేయబోతున్నారు.
టాపిక్