Ae Watan Mere Watan OTT: రేడియో స్టేషన్‍తో బ్రిటీషర్లపై పోరాటం.. ట్రైలర్ రిలీజ్.. నేరుగా ఓటీటీలోకి రానున్న మూవీ-ae watan mere watan trailer review sara ali khan as freedom fighter this movie will release on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ae Watan Mere Watan Trailer Review Sara Ali Khan As Freedom Fighter This Movie Will Release On Amazon Prime Video

Ae Watan Mere Watan OTT: రేడియో స్టేషన్‍తో బ్రిటీషర్లపై పోరాటం.. ట్రైలర్ రిలీజ్.. నేరుగా ఓటీటీలోకి రానున్న మూవీ

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 04, 2024 10:04 PM IST

Ae Watan Mere Watan OTT Movie Trailer: ఏ వతన్ మేరే వతన్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. సారా అలీ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి రానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవనుంది. ఈ సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది.

Ae Watan Mere Watan OTT: రేడియో స్టేషన్‍తో బ్రిటీషర్లపై పోరాటం.. ట్రైలర్ రిలీజ్
Ae Watan Mere Watan OTT: రేడియో స్టేషన్‍తో బ్రిటీషర్లపై పోరాటం.. ట్రైలర్ రిలీజ్

Ae Watan Mere Watan OTT: బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటం బ్యాక్‍డ్రాప్‍లో ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా 1940ల్లో రేడియో స్టేషన్ నిర్వహించిన భారత స్వాతంత్య్ర సమర యోధురాలు ఉషా మెహతా జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీకి కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహించారు. ఈ ‘ఏ వతన్ మేరే వతన్’ సినిమా ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ నేడు (మార్చి 4) రిలీజ్ చేసింది.

ట్రైలర్ ఇలా..

గాంధేయవాదిగా ఉండే ఉషా మెహతా (సారా అలీ ఖాన్) కాలేజీ రోజుల నుంచే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనే అంశంతో ‘ఏ వతన్ మేరే వతన్’ ట్రైలర్ మొదలైంది. ప్రమాదమని తెలిసినా.. కుటుంబ సభ్యులు వారించినా ఉద్యమంలో పోరాడుతూనే ఉంటారు ఉషా. ఈ క్రమంలో స్వాతంత్య్ర ఉద్యమకారుల్లో స్ఫూర్తిని నింపేందుకు ఆమె ప్రత్యేకంగా ఓ రేడియో ఛానెల్ ప్రారంభిస్తారు. ఈ రేడియో స్టేషన్‍ ఎక్కడుందో గుర్తించి ధ్వంసం చేసేందుకు బ్రిటీషర్లు ప్రయత్నిస్తారు. అయితే, ఎవరికీ తెలియని ప్రాంతంలో రహస్యంగా ఈ రేడియో స్టేషన్‍ను నిర్వహిస్తూ.. స్వాతంత్య్ర ఉద్యమానికి ఊతమిస్తుంటారు ఉషా.

ఉషా మెహతా జీవితం, రేడియో స్టేషన్‍తో ఆమె చేసిన స్వాతంత్య్ర పోరాటం గురించి ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రంలో ఉండనుంది. ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్‍గా సాగింది. పీరియాడిక్ సెటప్ కూడా పర్‌ఫెక్ట్‌గా కనిపించింది. మంచి బడ్జెట్‍తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ ట్రైలర్‌లో ఆకట్టుకుంది.

ఏ వతన్ మేరే వతన్’ చిత్రంలో ఉషా మెహతాగా సారా అలీ ఖాన్ నటించగా.. రామ్ మనోహర్ లోహియా పాత్రను ఇమ్రాన్ హష్మి పోషించారు. ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్,అభయ్ వర్మ, స్పర్ష్ శ్రీవాత్సవ్, అలెక్స్ ఓ నెల్, ఆనంద్ తివారీ కీలకపాత్రలు పోషించారు. ఇమ్రాన్ హష్మి పాత్ర ఈ చిత్రంలో కాసేపే ఉండనుంది.

తెలుగులోనూ స్ట్రీమింగ్

ఏ వతన్ మేరే వతన్ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. మార్చి 21న ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వస్తుంది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, మరాఠి, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుంది.

సినిమా గురించి..

ఏ వతన్ మేరే వతన్ చిత్రానికి కన్నన్, దరాబ్ ఫారూకీ రైటర్లుగా వ్యవహించారు. దర్శకుడు కన్నన్ అయ్యర్ తెరకెక్కించారు. ధర్మాటిక్ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమన్ మెహతా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రంలో ఇంతటి శక్తివంతమైన పాత్ర పోషించడం చాలా గౌరవంగా భావిస్తున్నానని, ఈ ఫీలింగ్ చెప్పేందుకు మాటలు రావడం లేదని సారా అలీఖాన్ అన్నారు. ఎంతో మంది త్యాగాలను తనకు ఈ చిత్రం గుర్తు చేసిందని తెలిపారు. ఈ సినిమా చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, మార్చి 21వ తేదీ కోసం వేచిచూస్తున్నానని చెప్పారు.

WhatsApp channel