OTT Web Series: ఓటీటీలోకి కొత్త వెబ్ సిరీస్.. ఐదుగురు అమ్మాయిల హంగామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..-adult drama web series ziddi girls will be streaming on amazon prime video soon trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Web Series: ఓటీటీలోకి కొత్త వెబ్ సిరీస్.. ఐదుగురు అమ్మాయిల హంగామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Web Series: ఓటీటీలోకి కొత్త వెబ్ సిరీస్.. ఐదుగురు అమ్మాయిల హంగామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 17, 2025 04:05 PM IST

OTT Web Series: జిడ్డీ గర్ల్స్ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. స్ట్రీమింగ్ డేట్ కూడా వెల్లడైంది. కాలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో న్యూఏజ్ డ్రామా సిరీస్‍గా తెరకెక్కింది.

OTT Web Series: ఓటీటీలోకి కొత్త వెబ్ సిరీస్.. ఐదుగురు అమ్మాయిల హంగామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
OTT Web Series: ఓటీటీలోకి కొత్త వెబ్ సిరీస్.. ఐదుగురు అమ్మాయిల హంగామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

జిడ్డీ గర్ల్స్ వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. ఈ సిరీస్‍లో అతియా తారా నాయక్, ఉమాంగ్ బదానియా, జైనా అలీ, దీయా దామిని, అనుప్రియ కరోలీ ప్రధాన పాత్రలు పోషించారు. పాపులర్ నటీమణులు సిమ్రన్, నందితా దాస్, రేవతి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అడల్ట్ డ్రామా సిరీస్‍గా ఇది రూపొందింది. నేడు (ఫిబ్రవరి 17) జిడ్డీ గర్ల్స్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. స్ట్రీమింగ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయింది.

ఐదుగురు అమ్మాయిల చుట్టూ..

ఢిల్లీలోని మటిల్డా హోస్ కాలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ జిడ్డీ గర్ల్స్ సిరీస్ సాగుతుంది. ఆ కళాశాలలో కట్టుబాట్లు కట్టుదిట్టంగా ఉంటాయి. అయితే అక్కడ చదివేందుకు వచ్చే ఐదుగురు అమ్మాయిలు అక్కడి రూల్స్, పద్దతులను వ్యతిరేకిస్తారు. కట్టుబాట్లను ధిక్కరిస్తారు, తిరుగుబాటు చేస్తారు. దీంతో యూనివర్సిటీలో క్లాష్ ఏర్పడుతుంది. సవాళ్లు ఎదురవుతాయి. వీటి చుట్టూ ఈ సిరీస్ ఉండనుందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఫ్రెండ్‍షిప్, రిలేషన్లు కూడా ప్రధానంగా ఉంటాయి. ఈ సిరీస్‍లో కామెడీ కూడా ఉంటుంది.

జిడ్డీ గర్ల్స్ సిరీస్‍కు సోనీలీ బోస్ దర్శకత్వం వహించారు. ఫోర్ మోర్ షాట్స్ సిరీస్‍తో పాపులర్ అయిన రంగిత ప్రితీషా నాండీ, ఇషితా ప్రతీశ్ నాండీ ఈ సిరీస్‍కు కూడా క్రియేటర్లుగా ఉన్నారు. వారిద్దరూ నిర్మాతలుగానూ ఉన్నారు. కట్టుబాట్లు ఉన్న కాలేజీలో మార్పుల కోసం ఐదుగురు అమ్మాయిలు ఎలా ముందుకు సాగారనే అంశం చుట్టూ ఈ సిరీస్ ఉండనుంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

జిడ్డీ గర్ల్స్ చిత్రం ఫిబ్రవరి 27వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. స్ట్రీమింగ్ డేట్‍ను అధికారికంగా రివీల్ చేసింది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో సిరీస్‍పై మంచి క్రేజ్ ఉండే ఛాన్స్ ఉంది.

ఈ వారమే ‘బేబీ జాన్’ రెగ్యులర్ స్ట్రీమింగ్

వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ బేబీ జాన్ ఫిబ్రవరి 20న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంతోనే బాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇచ్చారు సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి. ఈ మూవీ ఇప్పటికే రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే, ఫిబ్రవరి 20న రెంట్ తొలగిపోయి రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉండనుంది.

తమిళ మూవీ తెరి కథ ఆధారంగా బేబీ జాన్ చిత్రాన్ని తెరెక్కించారు. కలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 24న థియేటర్లలో రిలీజైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం