OTT Crime Thriller: ఓటీటీ ట్రెండింగ్‌లో అదరగొడుతోన్న క్రైమ్ థ్రిల్లర్- 8.4 ఐఎండీబీ రేటింగ్- తెలుగులోనూ స్ట్రీమింగ్!
Adolescence OTT Streaming And Trending: ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది క్రైమ్ థ్రిల్లర్ మినీ వెబ్ సిరీస్ అడోలసెన్స్. 8.4 ఐఎమ్‌డీబీ రేటింగ్ అందుకున్న ఈ సిరీస్‌ను కచ్చితంగా చూడమంటూ టాలీవుడ్ డైరెక్టర్ దేవ కట్టా ప్రశంసలు కురిపించారు. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న అడోలసెన్స్‌ను ఈ ఓటీటీలో చూసేయండి.
Adolescence OTT Release And Trending: ఓటీటీలో ఎన్నో విధాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కుతుంటాయి. కానీ, వాటిలో కొన్ని మైల్డ్ స్టోన్‌లా అలా గుర్తుండిపోతాయి. ఇక వాటికి వరల్డ్ వైడ్‌గా విపరీతమైన క్రేజ్ వస్తుంటుంది. ఇప్పుడు కూడా అంతటి రేంజ్‌లో వైరల్ అవుతోన్న క్రైమ్ థ్రిల్లర్ మినీ వెబ్ సిరీస్ అడోలసెన్స్.
యుక్త వయసు లేదా కౌమారదశ
బ్రిటీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన అడోలసెన్స్ అంటే యుక్త వయసు లేదా కౌమారదశ అనే అర్థం వస్తుంది. స్టీఫెన్ గ్రాహం కథ అందించి, నటించిన ఈ మినీ సిరీస్‌కు ఫిలిప్ బరంతిని దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో ఓవెన్ కూపర్, స్టీఫెన్ గ్రాహం, ఎరిన్ డొహెర్టీ, అష్లీ వాల్టర్స్, ఫయె మార్సే, క్రిస్టిన్ ట్రేమార్కో ఇతరులు కీలక పాత్రలు పోషించారు.
13 ఏళ్ల బాలుడి అరెస్ట్
అడోలసెన్స్ ఒక 13 ఏళ్ల జేమీ మిల్లర్ అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. తన గర్ల్ క్లాస్‌మేట్‌ను మర్డర్ చేసినట్లుగా కేసులో అక్యూస్‌డ్‌గా 13 ఏళ్ల జేమీని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తారు. రిమాండ్ ఖైదీగా ఉన్న జేమీ నుంచి ఈ ఇన్వెస్టిగేషన్‌లో నిజాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే ఒక ప్రఫొషెనల్ సైకియార్టిస్ట్ హెల్ప్ తీసుకుంటారు. అప్పుడు ఆయన చేసిన విచారణలో జేమీ ఎలాంటి నిజాలు బయటపెట్టాడనేదే ఈ సిరీస్ కథ.
4 ఎపిసోడ్స్- గంట రన్ టైమ్
సుమారు గంట పాటు రన్ టైమ్‌తో నాలుగు ఎపిసోడ్స్ ఉన్న అడోలసెన్స్ మినీ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయిన అడోలసెన్స్ తొలి రోజు నుంచే ట్రెండింగ్‌లోకి వచ్చింది. వరల్డ్ వైడ్‌గా ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1 వెబ్ సిరీస్‌గా చోటు సంపాదించుకున్న అడోలసెన్స్ తొలివారంలో దాదాపుగా 20 మిలియన్‌కుపైగా వ్యూస్ దక్కించుకుంది. 11 రోజుల్లో 66.3 మిలియన్ వ్యూస్ సాధించింది.
2 వారాలు కావొస్తున్న
దాంతో నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ సాధించిన సిరీస్‌లో ఒకటిగా అడోలసెన్స్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అడోలసెన్స్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చి 2 వారాలు కావొస్తున్నప్రటికీ ఇంకా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇండియాలోని ట్రెండింగ్ టీవీ షోలలో టాప్ 2 స్థానంలో అదరగొడుతోంది. అడోలసెన్స్ ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 8.4 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
దేవ కట్టా ప్రశంసలు
దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సిరీస్‌కు ఎంత హిట్‌గా నిలిచిందే. అంతేకాకుండా తెలుగులో ప్రస్థానం, రిపబ్లిక్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ దేవ కట్టా సైతం అడోలసెన్స్ సిరీస్‌ను మెచ్చుకున్నారు. "అడోలసెన్స్ అద్భుతంగా ఉంది. కచ్చితంగా చూడండి" అంటూ ప్రశంసలు కురిపించారు దర్శకుడు దేవ కట్టా.
ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్
టీనేజ్‌లో పిల్లలు చేసే అల్లరి, ఇతర విద్యార్థుల పట్ల ప్రదర్శించే తీరు, ప్రవర్తన, సోషల్ మీడియా ప్రభావం వంటి సామాజిక అంశాలతో తెరకెక్కిన అడోలసెన్స్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇంగ్లీష్‌తోపాటు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా, తమిళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది అడోలసెన్స్.
సంబంధిత కథనం