యంగ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న డెకాయిట్ చిత్రానికి క్రేజ్ బాగానే ఉంది. ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీలతో వచ్చే శేష్.. మరోసారి అదే ఫాలో అయ్యారు. ఈ చిత్రానికి కథ కూడా అందించారు. ఈ మూవీకి సునీల్ దేవ్ దర్శకత్వం వహించారు. ఈ డెకాయిట్ చిత్రం నుంచి నేడు (మే 26) గ్లింప్స్ వీడియో వచ్చింది.
మృణాల్ ఠాకూర్ కన్నీళ్లు పెట్టకునే షాట్‍తో డెకాయిట్ ఫైర్ గ్లింప్స్ మొదలైంది. “జూలియట్ నీకు జరిగింది మామూలు విషయం కాదు. అందరూ నిన్ను మోసం చేశారు. కానీ నేను నిన్ను మోసం చేయడానికి రాలేదు. కుడి****డానికి వచ్చా” అని అడివి శేష్ డైలాగ్ ఉంది. అనురాగ్ కశ్యప్ సీరియస్ లుక్‍లో కనిపించారు.
అడివి శేష్ క్యారెక్టర్ డెకాయిట్ చిత్రంలో డిఫరెంట్ షేడ్లలో ఉండనుందని తెలుస్తోంది. ముందుగా మృణాల్ ఠాకూర్‌ను నమ్మించి.. ఆ తర్వాత మోసం చేస్తాడనేలా గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. ఈ టీజర్లో శేష్ లుక్ కూడా గత చిత్రాలతో పోలిస్తే విభిన్నంగా ఉంది. రస్టిక్‍గా మాస్ లుక్‍తో అదిరిపోయారు యంగ్ హీరో. మృణాల్ ఠాకూర్ పాత్ర కూడా స్ట్రాంగ్‍గా అన్నట్టు అర్థమవుతోంది.
డెకాయిట్ మూవీకి ఒక ప్రేమకథ అనే ట్యాగ్‍లైన్ ఉంది. అయితే, ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌లా తెరకెక్కుతోందని అర్థమవుతోంది. ఈ మూవీ స్టోరీని అడివి శేష్, డైరెక్టర్ సునీల్ కలిసి ప్రిపేర్ చేశారు. ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు. గ్లింప్స్ వీడియోలో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్‍గా ఆకట్టుకుంది.
డెకాయిట్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 25వ తేదీన విడుదల కానుంది. క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు డేట్‍ను ఈ గ్లింప్స్ వీడియోలో మూవీ టీమ్ వెల్లడించింది. ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లు ఈ మూవీని నిర్మిస్తున్నాయి. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
డెకాయిట్ చిత్రంలో శేష్, మృణాల్, అనురాగ్‍తో పాటు ప్రకాశ్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జయిన్ మారి ఖాన్, కామాక్షి భాస్కర్ల కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో ముందుగా శృతి హాసన్ ఉండేవారు. టైటిల్ వీడియో కూడా వచ్చింది. అయితే, కాస్త షూటింగ్ తర్వాత ఆమె తప్పుకున్నారు. శృతి ప్లేస్‍లో మృణాల్ ఠాకూర్‌ను మూవీ టీమ్ తీసుకుంది. ఈ చిత్రానికి ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.
సంబంధిత కథనం