G2 Budget: భారీ బడ్జెట్‍తో అడివి శేష్ ‘జీ2’ సినిమా.. ఎన్ని కోట్లంటే?
G2 Budget: గూఢచారి సినిమాకు సీక్వెల్‍గా జీ2 రూపొందుతోంది. అయితే, ఈ చిత్రం భారీ బడ్జెట్‍తో రూపొందుతోందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. గ్రాండ్‍స్కేల్‍లో ఈ మూవీని తెరకెక్కించేందుకు మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.
మల్టీ టాలెంటెడ్, యంగ్ స్టార్ అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారి సినిమా మంచి హిట్ అయింది. 2018లో వచ్చిన ఈ యాక్షన్ స్పై మూవీ అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకోవటంతో పాటు ప్రశంసలను దక్కించుకుంది. ఈ మూవీ స్టోరీ, స్క్రీన్‍ప్లే ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాయి. గూఢచారి మూవీకి స్టోరీని కూడా అడివి శేష్ అందించారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. గూఢచారికి సీక్వెల్‍గా జీ2 చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి విజయ్ కుమార్ సిరిగినీడి డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‍లో రానుంది.
బడ్జెట్ ఎంతంటే..
జీ2 (గూఢచారి 2) సినిమా భారీ బడ్జెట్‍తో రూపొందుతోంది. ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కనుందని సమాచారం బయటికి వచ్చింది. గ్రాండ్ స్కేల్‍లో ఈ చిత్రాన్ని మేకర్స్ తీసుకురానున్నారు.
ఈ దేశాల్లో షూటింగ్
జీ2 సినిమా షూటింగ్ ఎక్కువగా విదేశాల్లోనే ఉంటుందని సమాచారం బయటికి వచ్చింది. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, పోలండ్, ఇటలీ సహా మరో రెండు యూరోపియన్ దేశాల్లో ఈ మూవీ షూటింగ్‍ను మేకర్స్ ప్లాన్ చేశారట. భారీ యాక్షన్ ఎపిసోడ్లు ఈ చిత్రంలో ఉండనున్నాయని తెలుస్తోంది. మొత్తంగా వరల్డ్ క్లాస్ మేకింగ్‍తో హైక్వాలిటీతో ఈ మూవీని తెరకెక్కించాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
జీ2 చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‍మెంట్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. వరుస హిట్లతో అడివి శేష్ మార్కెట్ పెరడటం, గూఢచారి మూవీకి క్రేజ్ ఉండటంతో భారీస్థాయిలో బడ్జెట్ పెట్టేందుకు ప్రొడక్షన్ హౌస్‍లు వెనుకాడడం లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్.
16 రెట్లు అధికం
గూఢచారి సినిమా రూ.6కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. 2018 ఆగస్టులో రిలీజైన ఈ చిత్రం సుమారు రూ.25కోట్ల కలెక్షన్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. తక్కువ బడ్జెట్ అయినా గూఢచారి చిత్రం చాలా క్వాలిటీతో వచ్చింది. ఈ సినిమా నరేషన్, స్టోరీ, స్క్రీన్‍ప్లే అదిరిపోయాయి. దీంతో భారీ హిట్ అవటంతో గూఢచారి ఫ్రాంచైజీకి ఫుల్ క్రేజ్ వచ్చింది.
ఈ మూవీకి సీక్వెల్‍గా వస్తున్న జీ2 ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్‍తో రూపొందనుంది. అంటే ఫస్ట్ మూవీ కంటే ఏకంగా సుమారు 16 రెట్ల అధిక బడ్జెట్‍తో రూపొందనుంది.
జీ2 చిత్రంలో అడివి శేష్‍తో పాటు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. మధు షాలినీ, సుప్రియ యార్లగడ్డ కీరోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కూడా హీరో అడివి శేష్ కథ అందించారు. డైరెక్టర్ వినయ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
మేజర్‌తో హిందీలోనూ..
మేజర్ సినిమాతో అడివి శేష్‍కు హిందీలోనూ చాలా క్రేజ్ వచ్చింది. 2022లో వచ్చిన ఆ మూవీ హిందీలో మంచి హిట్ అయింది. ముఖ్యంగా శేష్ యాక్టింగ్‍కు నేషనల్ వైడ్‍గా ప్రశంసలు దక్కాయి. మేజర్ సంజీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ జీవించేశారు. దీంతో జీ2 మూవీకి హిందీలోనూ ఫుల్ క్రేజ్ ఉండడం ఖాయం.