Adivi Sesh: సన్నీ లియోనీ వల్ల పేరు మార్చుకున్న టాలీవుడ్ హీరో.. అసలు స్టోరీ ఏంటో తెలుసా?-adivi sesh changed his name due to sunny leone popularity adivi sesh real name ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adivi Sesh: సన్నీ లియోనీ వల్ల పేరు మార్చుకున్న టాలీవుడ్ హీరో.. అసలు స్టోరీ ఏంటో తెలుసా?

Adivi Sesh: సన్నీ లియోనీ వల్ల పేరు మార్చుకున్న టాలీవుడ్ హీరో.. అసలు స్టోరీ ఏంటో తెలుసా?

Hari Prasad S HT Telugu

Adivi Sesh: సన్నీ లియోనీ వల్ల ఓ టాలీవుడ్ హీరో తన పేరు మార్చుకున్నాడన్న విషయం మీకు తెలుసా? దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీయే ఉంది. అదేంటో ఇక్కడ చూడండి.

సన్నీ లియోనీ వల్ల పేరు మార్చుకున్న టాలీవుడ్ హీరో.. అసలు స్టోరీ ఏంటో తెలుసా?

Adivi Sesh: టాలీవుడ్ హీరో సన్నీ చంద్ర మీకు తెలుసా? ఈ పేరు ఎక్కడా విన్నట్లు లేదా? పోనీ అడివి శేష్ ని గుర్తు పడతారా? కచ్చితంగా గుర్తు పట్టగలరు. ఆ సన్నీ చంద్రయే ఈ అడివి శేష్ అనే విషయం మీకు తెలుసా? ఆ సన్నీ చంద్ర శేష్ గా మారడం వెనుక ఒకప్పటి పోర్న్ స్టార్, ప్రస్తుత బాలీవుడ్ నటి సన్నీ లియోనీయే కారణమన్న విషయం కూడా చాలా మందికి తెలియదు.

సన్నీ చంద్ర.. అడివి శేష్ ఎలా అయ్యాడంటే?

అడివి శేష్.. తెలుగులో మంచి పేరున్న నటుడు. మేజర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గానూ ఎదిగాడు. క్షణం, హిట్ 2, గూఢచారిలాంటి సినిమాలు కూడా అతని కెరీర్లో పెద్ద హిట్స్ గా నిలిచాయి. అయితే అతని అసలు పేరు సన్నీ చంద్ర అని, సన్నీ లియోనీ వల్ల అతడు తన పేరును శేష్ గా మార్చుకున్నాడన్న విషయం చాలా మందికి తెలియదు.

ఈ విషయాన్ని అతడే మేజర్ మూవీ రిలీజ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. మరి ఆ స్టోరీ ఏంటో అతని మాటల్లోనే చూడండి. "నిజానికి నా అసలు పేరుతో అసలు శేష్ లేనే లేదు. నేను అమెరికాలో ఉన్న సమయంలో నా పేరు వల్ల అందరూ నన్ను టీజ్ చేసేవాళ్లు. అక్కడ సన్నీ డిలైట్ అనే ఓ ఆరెంజ్ ఫ్లేవర్ డ్రింక్ ఉండేది. అంతేకాదు అదే సమయంలో సన్నీ లియోనీ కూడా చాలా పాపులర్ అయింది. దీంతో నా పేరులో సన్నీ ఉండటం చూసి అందరూ టీజ్ చేసేవాళ్లు" అని శేష్ చెప్పాడు.

శేష్ పేరు అలా వచ్చింది..

అందరూ హేళన చేస్తుండటంతో తన పేరు మార్చుకోవాలని తాను నిర్ణయించుకున్నట్లు ఆ ఇంటర్వ్యూలో అడివి శేష్ చెప్పాడు. "నా పేరు వల్ల అందరూ నన్ను హేళన చేస్తున్నారని మా నాన్నతో నేను చెప్పాను. అప్పుడే నా పేరులో శేష్ అనే పదం కూడా ఉందని, దానిని వాడుకోవచ్చని ఆయన చెప్పారు. ఆ మాట వినగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.

మా నాన్న సునీల్ గవాస్కర్ కు వీరాభిమాని. అందుకే నాకు సన్నీ పేరు పెట్టారు. కానీ అప్పటి నుంచీ నేను నా పేరును శేష్ గా మార్చుకున్నాను. ఇండియాకు వచ్చిన తర్వాత ఇక్కడ శేష్ అనే పేరు చాలా కామన్ అని తెలిసింది" అని శేష్ తెలిపాడు.

అడివి శేష్ ప్రస్తుతం డెకాయిట్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శృతి హాసన్ కూడా నటిస్తోంది. శనీల్ దేవ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదొక యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. గతేడాది డిసెంబర్లో ఈ సినిమాను అనౌన్స్ చేయగా.. ఈ ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు గూఢచారి 2 కూడా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ రిలీజ్ పై ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు.