Multistarrer Movies: ఈ కాంబోలు అదుర్స్‌ - టాలీవుడ్‌, బాలీవుడ్ స్టార్స్ క‌లిసి చేస్తోన్న‌ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు ఇవే-adipurush to war2 upcoming tollywood bollywood stars combination multistarrer movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Multistarrer Movies: ఈ కాంబోలు అదుర్స్‌ - టాలీవుడ్‌, బాలీవుడ్ స్టార్స్ క‌లిసి చేస్తోన్న‌ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు ఇవే

Multistarrer Movies: ఈ కాంబోలు అదుర్స్‌ - టాలీవుడ్‌, బాలీవుడ్ స్టార్స్ క‌లిసి చేస్తోన్న‌ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు ఇవే

Nelki Naresh Kumar HT Telugu
Apr 08, 2023 05:55 AM IST

Multistarrer Movies: టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌లిసి సంద‌డి చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఈ అరుదైన కాంబినేష‌న్‌లో ప్ర‌స్తుతం కొన్ని సినిమాలు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే...

రామ్ చ‌ర‌ణ్, స‌ల్మాన్‌ఖాన్‌, వెంక‌టేష్‌
రామ్ చ‌ర‌ణ్, స‌ల్మాన్‌ఖాన్‌, వెంక‌టేష్‌

Multistarrer Movies: ఇదివ‌ర‌కు మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లో ఒకే భాష‌కు చెందిన హీరోలు న‌టించేవారు. కానీ పాన్ ఇండియ‌న్ క‌ల్చ‌ర్ కార‌ణంగా ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లో కొత్త ట్రెండ్ మొద‌లైంది. వివిధ భాష‌ల‌కు చెందిన స్టార్ హీరోలు క‌లిసి ఒకే ఫ్రేమ్‌లో క‌నిపిస్తోన్నారు. ప్ర‌స్తుతం ఇండియా వైడ్‌గా టాలీవుడ్ అద్భుత విజ‌యాల‌తో దూసుకుపోవ‌డంతో తెలుగు హీరోల‌తో క‌లిసి సినిమాలు చేసేందుకు బాలీవుడ్ హీరోలు సైతం ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తోన్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్ హీరోల కాంబినేష‌న్‌లో ప‌లు మ‌ల్టీస్టార‌ర్‌ సినిమాలో రాబోతున్నాయి. ఈ సినిమాలు ఇవే…

ఎన్టీఆర్ - హృతిక్ రోష‌న్‌

ఆర్ఆర్ఆర్ సినిమాతో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎన్టీఆర్‌కు (Ntr) ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌ర్వాత బాలీవుడ్ నుంచి ఎన్టీఆర్‌కు అవ‌కాశాలు క్యూ క‌డుతోన్నాయి. ఈ ఏడాదే ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. హృతిక్ రోష‌న్‌తో( Hrithik Roshan)వార్ -2 మూవీ చేయ‌బోతున్నాడు.

హై ఇంటెన్స్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు బ్ర‌హ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. ఇందులో ఎన్టీఆర్‌, హృతిక్ రోష‌న్ పాత్ర‌లు పోటాపోటీగా సాగుతాయ‌ని స‌మాచారం. య‌శ్‌రాజ్‌ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇంకా షూటింగ్ మొద‌లుకాక‌ముందే ఈ సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈజీగా ఈసినిమా వెయ్యి కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ర‌వితేజ - వ‌రుణ్‌ధావ‌న్

మానాడు రీమేక్‌తో ర‌వితేజ (Raviteja) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మిళంలో శింబు ఎస్‌జే సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు జోరుగా స‌న్నాహాలు చేస్తోన్నారు.

ఈ హిందీ రీమేక్‌లో ర‌వితేజ‌తో పాటు వ‌రుణ్‌ధావ‌న్ మ‌రో హీరోగా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఎస్‌జే సూర్య పాత్ర‌ను ర‌వితేజ చేస్తోండ‌గా శింబు క్యారెక్ట‌ర్‌లో వ‌రుణ్‌ధావ‌న్ న‌టించ‌నున్న‌ట్లు తెలిసింది. ఈ బాలీవుడ్ రీమేక్‌ను సునీల్ నారంగ్‌తో క‌లిసి టాలీవుడ్ హీరో రానా నిర్మించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి.

స‌ల్మాన్‌ఖాన్ - వెంక‌టేష్‌

స‌ల్మాన్‌ఖాన్ హీరోగా న‌టిస్తోన్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది. యాక్ష‌న్ ల‌వ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాలో టాలీవుడ్ హీరో వెంక‌టేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్నాడు.

స‌ల్మాన్‌ఖాన్ సినిమాతోనే లాంగ్ గ్యాప్ త‌ర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు వెంక‌టేష్‌. ఇందులో పూజాహెగ్డే బ్ర‌ద‌ర్‌గా వెంక‌టేష్ క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ సినిమాలో ఏంట‌మ్మా అనే పాట‌లో రామ్‌చ‌ర‌ణ్ (Ramcharan) గెస్ట్‌గా మెర‌వ‌నున్నాడు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఈ వీడియో సాంగ్‌లో స‌ల్మాన్‌ఖాన్‌, వెంకీల‌తో క‌లిసి లుంగీ డ్యాన్స్‌లో చ‌ర‌ణ్ అద‌ర‌గొట్టాడు. ప‌వ‌న్ హీరోగా న‌టించిన కాట‌మ‌రాయుడు రీమేక్‌గా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా తెర‌కెక్కుతోంది.

ప్ర‌భాస్ - సైఫ్ అలీఖాన్‌

ప్ర‌స్తుతం పాన్ ఇండియ‌న్ వైడ్‌గా క్రేజ్ నెల‌కొన్న సినిమాల్లో ఆదిపురుష్ ఒక‌టి. రామాయ‌ణ గాథ ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ప్ర‌భాస్ (Prabhas) రాముడి పాత్ర‌లో న‌టిస్తోండ‌గా రావ‌ణుడిగా సైఫ్ అలీఖాన్ న‌టిస్తోన్నాడు. జూన్ 16న తెలుగు, హిందీతో పాటు ఇత‌ర భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

వీటితో పాటుగా షారుఖ్‌ఖాన్ హీరోగా న‌టిస్తోన్న జ‌వాన్ సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ పాత్ర‌లో న‌టిస్తోన్న‌ట్లు స‌మాచారం. ఇదే కాకుండా టాలీవ‌డ్‌, బాలీవుడ్ హీరోల కాంబినేష‌న్‌లో మ‌రికొన్ని మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ సిద్ధ‌మ‌వుతోన్నాయి.