Adipurush OTT Release Date: ఆదిపురుష్ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే - షాకింగ్ ధరకు అమ్ముడుపోయిన డిజిటల్ రైట్స్
Adipurush OTT Release Date: ప్రభాస్ ఆదిపురుష్ సినిమా జూన్ 16న భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలకాబోతున్నది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందంటే.
Adipurush OTT Release Date: బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో ప్రస్తుతం ఆదిపురుష్ మాటే వినిపిస్తొంది. ఈ మైథలాజికల్ విజువల్ వండర్ మూవీ జూన్ 16న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. అన్ని భారతీయ భాషల్లో కలిపి రిలీజ్‌కు ఒక రోజు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ 100 కోట్లను క్రాస్ చేసి ఆదిపురుష్ కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది.
కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ (Amazon prime video) దక్కించుకున్నట్లు సమాచారం. థియేటర్‌రిలీజ్ తర్వాత ఎనిమిది వారాల గ్యాప్ అనంతరం ఈ సినిమాను ఓటీటీలో (OTT) రిలీజ్ చేసేలా అమెజాన్ ప్రైమ్‌తో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ సెకండ్ వీక్‌లో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. అంతకుముందుగా ఓటీటీలో ఈ సినిమా వచ్చే అవకాశం లేదని సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చినట్లు చెబుతోన్నారు.
అన్ని భాషల్లో కలిపి దాదాపు 250 కోట్లకు ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ప్రభాస్ (Prabhas) కెరీర్‌లో అత్యధిక ధరకు డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయిన మూవీగా ఆదిపురుష్ నిలిచింది. కాగా జూన్ 16న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 6200లకుపైగా స్క్రీన్స్‌లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. రామాయణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఆదిపురుష్ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
ఇటీవల రిలీజైన ట్రైలర్‌లో (Trailer) రాముడిగా ప్రభాస్ లుక్, డైలాగ్స్‌కు అభిమానులను ఆకట్టుకొన్నాయి. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో లైవ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో ఈ మూవీని తెరకెక్కించారు. కృతిసనన్ (Kritisanon) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణుడి పాత్రను పోషిస్తోన్నారు.