Producer Gifts Ferrari Car To Om Raut: ఆదిపురుష్ డైరెక్ట‌ర్‌కు నాలుగు కోట్ల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూస‌ర్-adipurush director om raut receives a ferrari car as gift from producers ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Adipurush Director Om Raut Receives A Ferrari Car As Gift From Producers

Producer Gifts Ferrari Car To Om Raut: ఆదిపురుష్ డైరెక్ట‌ర్‌కు నాలుగు కోట్ల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూస‌ర్

Nelki Naresh Kumar HT Telugu
Oct 14, 2022 03:53 PM IST

Producer Gifts Ferrari Car To Om Raut: ఆదిపురుష్ ద‌ర్శ‌కుడు ఓంరౌత్‌కు నిర్మాత‌లు నాలుగు కోట్ల కాస్ట్‌లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ కారులో ఓంరౌత్ చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ప్ర‌భాస్‌, ఓంరౌత్‌
ప్ర‌భాస్‌, ఓంరౌత్‌

Producer Gifts Ferrari Car To Om Raut: ఆదిపురుష్ డైరెక్ట‌ర్ ఓంరౌత్‌కు నిర్మాత‌లు కాస్ట్‌లీ కారును గిఫ్ట్‌గా అందించిన‌ట్లు స‌మాచారం. ఈ కారు ధ‌ర నాలుగు కోట్ల‌పైనే ఉంటుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌భాస్ (Prabhas) హీరోగా రామాయ‌ణ గాథ ఆధారంగా ఆదిపురుష్ సినిమా రూపొందుతోంది. మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీలో దాదాపు ఐదు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ద‌ర్శ‌కుడు ఓంరౌత్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే అయోధ్య‌లో ఈ సినిమా టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ప్ర‌భాస్‌తో పాటు సైఫ్ అలీఖాన్ లుక్‌, గెట‌ప్‌తో పాటు విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లొచ్చాయి. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఓంరౌత్‌పై ఫైర్ అయ్యారు.

త్రీడీ టీజ‌ర్‌తో ఈ విమ‌ర్శ‌ల తాకిడి త‌గ్గింది. నార్మ‌ల్ టీజ‌ర్‌తో పోలిస్తే త్రీడీలో విజువ‌ల్స్‌, గ్రాఫిక్స్ బాగున్నాయ‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్రీడీ టీజ‌ర్‌కు అన్ని భాష‌ల్లో మంచి రెస్పాన్స్ ల‌భిస్తోంది. తాజాగా ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు ఓంరౌత్ తెర‌కెక్కించిన తీరుకు నిర్మాత‌లు ఇంప్రెస్ అయిన‌ట్లు చెబుతున్నారు.

నిర్మాత భూష‌ణ్ కుమార్ దాదాపు నాలుగు కోట్ల కుపైగా విలువైన ఫెరారీ ఎఫ్‌8 కారును ఓంరౌత్‌కు గిఫ్ట్‌గా ఇచ్చిన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ ఖ‌రీదైన ఫెరారీ కారులో ఓంరౌత్ చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఈ కారును నిర్మాత‌ల నుంచి ఓంరౌత్ గిఫ్ట్ పొందిన‌ట్లు చెబుతున్నారు.

కాగా ఆదిపురుష్ సినిమా సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో జాన‌కిగా కృతిస‌న‌న్ (Krithi sanon) న‌టిస్తోంది. రావ‌ణ్‌గా సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌బోతున్నాడు. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఆదిపురుష్ రిలీజ్ కానుంది. ఈ సినిమాను త్రీడీతో పాటు ఐమాక్స్ ఫార్మెట్‌లో విడుద‌ల‌కానుంది.

IPL_Entry_Point