Adipurush box office: ఆదిపురుష్ రిలీజ్‌కు ముందే రూ.3 కోట్లు వచ్చేశాయ్.. లక్షన్నర ఫ్రీ టికెట్ల ఎఫెక్ట్
Adipurush box office: ఆదిపురుష్ రిలీజ్‌కు ముందే రూ.3 కోట్లు వచ్చేశాయ్.. లక్షన్నర ఫ్రీ టికెట్ల ఎఫెక్ట్ తో ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ రావడంతోపాటు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కలెక్షన్ల పరంపర కూడా ప్రారంభమైంది.
Adipurush box office: ఆదిపురుష్ మూవీని ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అలాంటి సినిమాల్లో లాభాల్లోకి వెళ్లాలంటే ఇంకెన్ని వందల కోట్లు వసూలు చేయాలో ఆలోచించండి. అయితే రిలీజ్ కు ముందే ఫ్రీ టికెట్ల రూపంలో ఆదిపురుష్ బిజినెస్ మొదలైంది. ఇప్పటి వరకూ ఏకంగా 1.5 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ లో భాగంగా ఫ్రీ టికెట్ల కోసం అమ్ముడయ్యాయి.
ఆదిపురుష్ మూవీని అందరికీ చేరువ చేయాలన్న ఉద్దేశంతో కొందరు స్టార్ హీరోలు, ఇతర ఇండస్ట్రీ వాళ్లు ఫ్రీగా టికెట్లు పంచాలని నిర్ణయించిన సంగతి తెలుసు కదా. టాలీవుడ్ హీరో రామ్ చరణ్, బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ లాంటి వాళ్లు అనాథలు, అణగారిన వర్గాల వారి కోసం ఇలా ఈ మూవీ టికెట్లను పెద్ద సంఖ్యలో కొన్నారంటూ వార్తలు వచ్చాయి.
దీంతో అలా ఫ్రీగా పంచేందుకు కొన్న టికెట్ల ద్వారానే రూ.3 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ అంచనా వేశాడు. మంగళవారం (జూన్ 13) అతడు చేసిన ట్వీట్ వైరల్ అయింది. సగటును ఒక్కో టికెట్ కు రూ.200 వేసుకున్నా.. లక్షన్నర టికెట్ల ద్వారా రూ.3 కోట్లు వచ్చినట్లు మనోబాల వెల్లడించాడు. అయితే రూ.500 కోట్ల బడ్జెట్ సినిమాకు ఇది పెద్ద మొత్తం కాకపోయినా.. ఫ్రీ టికెట్లు అంటూ కావాల్సినంత పబ్లిసిటీ మాత్రం వచ్చినట్లు అతడు చెప్పడం విశేషం.
ఆదిపురుష్ మూవీ వచ్చే శుక్రవారం (జూన్ 16) రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను ఓం రౌత్ డైరెక్ట్ చేశాడు. ప్రభాస్ రాముడిగా, క్రుతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నార్త్ లో ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. తెలుగు రాష్ట్రాల్లో బుక్ మై షో ద్వారా బుధవారం (జూన్ 14) నుంచి బుకింగ్స్ మొదలవనున్నాయి.
సంబంధిత కథనం