Robinhood: నితిన్ సినిమాలో విలన్‍గా ఆదిపురుష్ నటుడు.. భీకరంగా ఫస్ట్ లుక్
Robinhood: రాబిన్‍హుడ్ సినిమా నుంచి మరో అప్‍డేట్ వచ్చింది. ఈ చిత్రంలో విలన్‍గా బాలీవుడ్ యాక్టర్ నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ నేడు వచ్చింది.
నితిన్ హీరోగా రాబిన్‍హుడ్ సినిమా తెరకెక్కుతోంది. గతేడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ఈ ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. భీష్మ తర్వాత ఐదేళ్లుగా సరైన హిట్ కోసం నిరీక్షిస్తున్న నితిన్ ఈ చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుమలనే రాబిన్‍హుడ్ మూవీకి దర్శకుడిగా ఉన్నారు. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. రాబిన్‍హుడ్ సినిమాలో విలన్ ఎవరో నేడు (ఫిబ్రవరి 5) అధికారికంగా వెల్లడైంది.

ఫస్ట్ లుక్ భీకరంగా..
రాబిన్‍హుడ్ చిత్రంలో బాలీవుడ్ నటుడు దేవ్‍దత్త నాగే మెయిన్ విలన్‍గా నటిస్తున్నారు. ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించిన ఆదిపురుష్ చిత్రంలో ఆంజనేయుడిగా దేవ్‍దత్త నటించారు. ఇప్పుడు రాబిన్‍హుడ్‍లో విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు.
దేవ్‍దత్త నాగే పుట్టిన రోజు సందర్బంగా నేడు రాబిన్‍హుడ్ నుంచి ఆయన ఫస్ట్ లుక్‍ను మూవీ టీమ్ రివీల్ చేసింది. లాగ్ హెయిర్, గుబురు గడ్డం, మీసాలు, పంచె కట్టుతో రక్టిక్ లుక్‍లో ఆయన ఈ పోస్టర్లో ఉన్నారు. పొగలు కక్కుతున్న మెటల్ పరికరంతో సిగరెట్ కాల్చుకుంటున్న దేవ్‍దత్త నాగే లుక్ భీకరంగా ఉంది.
వీరమల్లు డేటే..
మార్చి 28వ తేదీనే రాబిన్‍హుడ్ మూవీ రిలీజ్ అవుతుందని మూవీ టీమ్ ఈ పోస్టర్‌లోనూ పేర్కొంది. అదే రోజున పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరి హర వీరమల్లు రిలీజ్ కానుంది. పవన్‍కు డైహార్డ్ ఫ్యాన్ అయిన నితిన్ మూవీ కూడా అదే డేట్‍ను లాక్ చేసుకుంది. వీరమల్లు వాయిదా పడుతుందనే నమ్మకంతోనే ఇలా చేశారన్నది టాక్. మరి చివర్లో తేదీల్లో మార్పులు ఉంటాయా.. బాక్సాఫీస్ దగ్గర రెండు చిత్రాలు పోటీ పడే పరిస్థితి ఉంటుందా అనేది ఆసక్తికరంగా ఉంది.
రాబిన్‍హుడ్ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‍గా నటించారు. భీష్మతో సూపర్ హిట్ కొట్టిన నితిన్ - డైరెక్టర్ వెంకీ కాంబో మళ్లీ రివీట్ అవుతోంది. ఈ చిత్రం యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని గతంలో వచ్చిన టీజర్ ద్వారా అర్థమైంది. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తొలి పాటను త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా క్యామియో రోల్‍లో కనిపించనున్నారు.
సంబంధిత కథనం