Adikeshava OTT Rights: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఆదికేశవ సినిమా నేడు (నవంబర్ 24) థియేటర్లలో రిలీజ్ అయింది. పక్కా మాస్ యాక్షన్ మూవీగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదికేశవ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా, ఆదికేశవ సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్ ఖరారైంది.
ఆదికేశవ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ తర్వాత ఆ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. డిసెంబర్ ఆఖర్లో ఆదికేశవ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అలాగే, ఆదికేశవ శాటిలైట్ రైట్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. స్టార్ మా ఛానెల్ ఈ మూవీ శాటిలైట్ హక్కులను దక్కించుకుంది.
ఆదికేశవ సినిమాలో యాక్షన్ బాగానే ఉన్నా.. కథ రొటీన్‍గా ఉందనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఓ ఫార్మాట్‍లో సినిమా సాగిందని టాక్ బయటికి వచ్చింది. అయితే, ఈ చిత్రానికి హీరోయిన్ శ్రీలీల హైలైట్‍గా నిలిచారు. రెండు వేరియషన్స్ ఉన్న పాత్రలో హీరో వైష్ణవ్ తేజ్ కూడా మెప్పించారు. అయితే, ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ సీన్లపై ట్రోల్స్ కూడా జోరుగా వస్తున్నాయి.
ఆదికేశవ చిత్రంలో జోజు జార్జ్, సుమన్, సుదర్శన్, అపర్ణా దాస్, తనికెళ్ల భరణి కీలకపాత్రల్లో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు.
కాగా, ఉప్పెన సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు పంజా వైష్ణవ్ తేజ్. తొలి చిత్రంతోనే భారీ హిట్ కొట్టారు. అయితే, ఆ తర్వాత ఆ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కొండపొలం, రంగ రంగ వైభవంగా సినిమాలు విఫలమయ్యాయి. ఆదికేశవ సినిమాతో యాక్షన్ మోడ్‍లోకి మారారు వైష్ణవ్. ఈ చిత్రంతో మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు.