Bigg Boss Telugu 6 Episode 80: ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ.. ఆదిరెడ్డికి పెరిగిన హైప్.. కోచింగ్ క్లాస్ టాస్క్ ఫుల్ ఫన్-adi reddy family enter into bigg boss season 6 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 6 Episode 80: ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ.. ఆదిరెడ్డికి పెరిగిన హైప్.. కోచింగ్ క్లాస్ టాస్క్ ఫుల్ ఫన్

Bigg Boss Telugu 6 Episode 80: ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ.. ఆదిరెడ్డికి పెరిగిన హైప్.. కోచింగ్ క్లాస్ టాస్క్ ఫుల్ ఫన్

Maragani Govardhan HT Telugu
Nov 23, 2022 07:21 AM IST

Bigg Boss Telugu 6 Episode 80: ఈ ఎపిసోడ్‌లో హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి వస్తారు. ముందుగా ఆదిరెడ్డి భార్య పాపతో కలిసి వస్తారు. పాప ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంటుంది. ఇంటి సభ్యులు కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తారు. అనంతరం రాజ్ వాళ్ల అమ్మ కూడా హౌస్‌లోకి వస్తారు.

బిగ్‌బాస్ సీజన్ 6 ఫ్యామిలీ ఎపిసోడ్
బిగ్‌బాస్ సీజన్ 6 ఫ్యామిలీ ఎపిసోడ్

Bigg Boss Telugu 6 Episode 80: బిగ్‌బాస్ సీజన్ 6లో ఫ్యామిలీ ఎపిసోడ్ మొదలైంది. ప్రతి సీజన్ మాదిరిగానే ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లకు హైప్ అమాంతం పెరుగుతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులను కలుసుకుని వారి గేమ్ ఎలా ఉందో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఫలితంగా గేమ్‌ను ఛేంజ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ సారి కూడా అదే జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క బిగ్‌బాస్ కోచింగ్ క్లాస్ అనే టాస్క్ కూడా ఇచ్చారు. ఫస్ట్ సీజన్‌లో ఈ టాస్క్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవదీప్ కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ రేంజ్‌లో కాకపోయినా ఇప్పుడు కూడా ఈ టాస్క్ బాగానే ఉండేలా కనిపిస్తుంది. మొత్తంగా ఎపిసోడ్ కామెడీతో పాటు ఎమోషన్లతో బాగానే సాగింది.

ముందుగా గుడ్‌మార్నింగ్ అనే సాంగ్‌తో బిగ్‌బాస్ హౌస్ మేట్స్ నిద్రలేపుతారు. అనంతరం రేవంత్ కెప్టెన్‌గా స్ట్రిక్ట్‌గా ఉంటున్నాడని కీర్తి, ఇనాయా చర్చించుకంటున్నారు. ఇంతలో బిగ్‌బాస్ కోచింగ్ క్లాస్ అనే టాస్క్ ఇస్తారు. దీని ప్రకారం ఫైమా ఇంగ్లీష్ టీచర్‌గా, ఆదిరెడ్డి డ్యాన్స్ టీచర్, శ్రీసత్య మేకప్ టీచర్, రాజ్ సింగింగ్ టీచర్‌గా ఉంటారనగా.. మిగిలినవారు స్టూడెంట్స్‌గా ఉంటారు. ముందుగా ఫైమా తన వచ్చి రానీ ఇంగ్లీష్‌తో ఫుల్ కామెడీ చేసింది. రేవంత్‌ కూడా అందుకు తగినట్లుగా పంచ్‌లు వేయడం, శ్రీహాన్ చిన్నపిల్లాడిలా అలరించడం ఇలా అందరూ ఫైమాతో పాటు కామెడీ అందించారు.

ఆదిరెడ్డికి ఫుల్ హైప్..

ఇంతలో ఆదిరెడ్డి భార్య కవిత, పాప అద్విత వచ్చారు. అయితే ఆ సమయంలో ఆదిరెడ్డి ఇంట్లో ఉండటంతో గేట్‌లో నుంచి చూసిన ఇనాయా.. ఉత్సాహంగా ఆపుకోలేక ఇనాయ వచ్చి చెబుతుంది. ఇదే సమయంలో వీరిద్దరూ ఎంట్రీ ఇస్తారు. కవితను చూసిన ఆనందంలో ఆదిరెడ్డి ఎమోషనల్ అవుతాడు. పాపను చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయితే పాప ఆదిరెడ్డిని గుర్తుపట్టకపోవడంతో ఎంతో బాధపడతాడు. టీవీ చూపించు కవిత.. నాన్నను గుర్తుపట్టకపోవడం ఏంటి అని అసంతృప్తి చెందుతాడు. నా గేమ్ ఎలా ఉందో చెప్పు అనగానే.. కవిత నాకైతే నచ్చుతుంది. నువ్వు చాలా మంది అర్థం కావట్లేదు అని చెబుతుంది. అంతేకాకుండా నీ ప్లాన్లు బయటకు చెప్పకు.. నీలోనే ఉంచుకో.. ఆదిరెడ్డి తర్వాత ఏం చేస్తాడని ఆడియెన్స్ అనుకోవాలి అనే బూస్ట్ ఇస్తుంది. రివ్యూవర్ బయటకొస్తున్నాడ కవిత అని ఆదిరెడ్డి అంటాడు.

ఇంతకు ముందు ఆదిరెడ్డి బిగ్‌బాస్‌ను అడిగిన కోరిక నెరవేరుతుంది. తన కూతురు మొదటి పుట్టిన రోజు బిగ్‌బాస్ ఇంట్లో జరగాలి అనే అతడి కోరికను బిగ్‌బాస్ తీరుస్తారు. హౌస్ మేట్స్ అందరూ కలిసి హౌస్ కేక్ కట్ చేస్తారు. ఆదిరెడ్డి తన పాప తనను కూతురును గుర్తుపట్టకపోవడంతో కాస్త ఇబ్బందిగా ఫీలవుతాడు.

అనంతరం సత్య మేకప్ టీచర్‌గా అలరిస్తుంది. మేకప్ అంటే ఏంటి అని అడుగ్గా.. మేకు అప్‌లో ఉంటే మేకప్ అవుతుందని రేవంత్ అనండం, మేకప్‌ను కప్పులో మేకప్పు అవుతుందని రాజ్ చెప్పడం, మేలో పుట్టిన కప్పను మేకప్ అంటారని శ్రీహాన్ చెప్పడం లాంటి పంచ్‌లు నవ్వు తెప్పిస్తాయి. అనంతరం శ్రీహాన్‌కు ఇంటి సభ్యులందరూ కలిసి మేకప్ వేస్తారు. ఆ తర్వాత రాజ్ అమ్మ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారు. తల్లిని చూసిన ఆనందంలో రాజ్ కూడా ఫూల్ హ్యాపీగా ఫీలవుతాడు. ఆమె తనతో పాటు తీసుకొచ్చిన రక్ష తాడును అతడికి కడుతుంది. ఐదు లక్షలు ఎందుకో ఖర్చు చేశాడో రాజ్ చెబుతాడు. తల్లిని ఇంతవరకు ఎక్కడకు తీసుకెళ్లలేదని ఇంత పెద్ద ప్లాట్‌ఫాంలో ఆమెను చూపించాలని అనుకున్నానని అందుకే ఐదు లక్షలు ఖర్చు పెట్టినట్లు చెబుతాడు. ఆమె కూడా ఇంటి సభ్యులందరిని ఎంతో ప్రేమగా పలకరిస్తారు. కీర్తి గాయం గురించి అడుగుతారు. ఇంటి సభ్యులందరూ ఫ్యామిలీ మెంబర్స్‌ను చూసి చాలా హ్యాపీగా ఫీలవుతారు.

అనంతరం ఆదిరెడ్డి డ్యాన్స్ టీచర్ అవతారమెత్తి పుల్ సందడి చేస్తారు. తన స్టెప్పులతో హౌస్ మేట్స్‌తో పాటు ఆడియెన్స్‌ను కూడా నవ్వు తెప్పిస్తారు. ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం వినోద భరితంగా సాగుతుంది. బిగ్‌బాస్ డ్యాన్స్ చేసి ఫుల్ అలిసిపోయానంటూ ఆదిరెడ్డి చెబుతారు. అంతేకాకుండా అటెండన్స్ తీసుకునే సమయంలోనూ డ్యాన్స్ స్టెప్పులతో హౌస్ మేట్స్ అటెండన్స్ చెప్పడం నవ్వు తెప్పిస్తుంది.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం