Adah Sharma Buys Sushant Singh Flat: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఫ్లాట్‌ను కొన్న అదాశ‌ర్మ-adah sharma buys sushant singh rajput flat details here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adah Sharma Buys Sushant Singh Flat: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఫ్లాట్‌ను కొన్న అదాశ‌ర్మ

Adah Sharma Buys Sushant Singh Flat: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఫ్లాట్‌ను కొన్న అదాశ‌ర్మ

HT Telugu Desk HT Telugu
Aug 26, 2023 05:19 PM IST

Adah Sharma Buys Sushant Singh Flat: దివంగ‌త బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు చెందిన ఫ్లాట్‌ను అదా శ‌ర్మ భారీ రేట్‌ను కొన్న‌ట్లు సినీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

 అదా శ‌ర్మ
అదా శ‌ర్మ

Adah Sharma Buys Sushant Singh Flat: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చ‌నిపోవ‌డానికి ముందు నివ‌సించిన ఖ‌రీదైన ఫ్లాట్‌ను హీరోయిన్ అదా శ‌ర్మ కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. కైపోచే, ఎంఎస్‌ధోనీ, చిచోరే లాంటి సినిమాల‌తో బాలీవుడ్‌లో ప్ర‌తిభావంతుడైన హీరోగాపేరుతెచ్చుకున్నాడు సుశాంత్ సింగ్‌.

కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలోనే 2020 జూన్ 14న బంద్రాలోని త‌న ఫ్లాట్‌లో సుశాంత్ సింగ్ ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి మూడేళ్లు దాటినా అత‌డి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ వెన‌కున్న కార‌ణాలు మాత్రం ఇప్ప‌టికీ రివీల్ కాలేదు. సుశాంత్ సింగ్ చ‌నిపోవ‌డానికి ముందు బంద్రాలోని ఖ‌రీదైన ఫ్లాట్‌లో నివ‌సించేవాడు.

సీ ఫేసింగ్ ఫ్లాట్ కోసం సుశాంత్ సింగ్ నెల‌కు ఐదు ల‌క్ష‌ల‌కుపైనే రెంట్ చెల్లించేవాడ‌ని స‌మాచారం. సుశాంత్ సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత అత‌డు రెంట్‌కు ఉన్న ఫ్లాట్‌ను కొనుగోలు చేసేందుకు ప‌లువురు ఆస‌క్తి చూపిన‌ట్లు వార్త‌లొచ్చాయి. తాజాగా ఈ ఫ్లాట్‌ను హీరోయిన్ అదా శ‌ర్మ కొన్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ ఫ్లాట్ కోసం అదా శ‌ర్మ‌ భారీ రేట్ వెచ్చించిన‌ట్లు చెబుతోన్నారు. త్వ‌ర‌లోనే ఈ ఫ్లాట్‌లోని అదా శ‌ర్మ షిప్ట్ కోబోతున్న‌ట్లు తెలిసింది. గ‌త ఏడాది రిలీజైన ది క‌శ్మీర్ ఫైల్స్ సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ స‌క్సెస్‌ను అందుకున్న‌ది అదా శ‌ర్మ‌.

15 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిన్న సినిమా 300 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ స‌క్సెస్ త‌ర్వాత బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది అదాశ‌ర్మ‌. ప్ర‌స్తుతం తెలుగులో సీడీ (క్రిమిన‌ల్ అండ్ డెవిల్‌) అనే సినిమా చేస్తోంది.

Whats_app_banner