Sreeleela Remuneration: పుష్ప-2లో ఐటెం సాంగ్ కోసం భారీగా పారితోషికం తీసుకున్న శ్రీలీల, క్రేజ్ అలాంటిది మరి!-actress sreeleela big paycheck for pushpa 2 kissik song revealed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sreeleela Remuneration: పుష్ప-2లో ఐటెం సాంగ్ కోసం భారీగా పారితోషికం తీసుకున్న శ్రీలీల, క్రేజ్ అలాంటిది మరి!

Sreeleela Remuneration: పుష్ప-2లో ఐటెం సాంగ్ కోసం భారీగా పారితోషికం తీసుకున్న శ్రీలీల, క్రేజ్ అలాంటిది మరి!

Galeti Rajendra HT Telugu
Nov 11, 2024 08:33 PM IST

Pushpa 2 Kissik song: పుష్ప-1లో ఐటెం సాంగ్ కోసం అప్పట్లో ఆ సినిమాలోని హీరోయిన్ రష్మిక మంధనా కంటే ఎక్కువ పారితోషికాన్ని సమంత తీసుకోగా.. ఇప్పుడు పుష్ప-2లో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల కూడా భారీగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.

శ్రీలీల, అల్లు అర్జున్
శ్రీలీల, అల్లు అర్జున్

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రూల్’ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 5న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుండగా.. ఈ మూవీలో క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. ఇప్పటికే ఈ సాంగ్‌కి సంబంధించి ఒక స్టిల్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా.. అందులో హాట్‌గా కనిపించిన శ్రీలీల పాటపై అంచనాల్ని మరింత పెంచేసింది.

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ప్రస్తుతం కొనసాగుతున్న శ్రీలీల.. ఇలా మూవీలో ఐటెం సాంగ్ చేయడం ఇదే తొలిసారి. దాంతో పుష్ప-2లో ఐటెం సాంగ్ కోసం ఈ ముద్దుగుమ్మ భారీగా పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సుకుమార్‌కి సెంటిమెంట్

డైరెక్టర్ సుకుమార్ తన తొలి సినిమా నుంచి ఐటెం సాంగ్‌ సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. పుష్ఫ: ది రైజ్ మూవీలో సమంత స్పెషల్ సాంగ్‌ను చేసింది. ‘‘ఊ అంటావా ఊఊ ఉంటావా’’ పాట దేశవ్యాప్తంగా అప్పట్లో ఓ ఊపు ఊసేసిన విషయం తెలిసిందే.

'పుష్ప 2' సినిమాలో ఐటమ్ సాంగ్‌ కోసం తొలుత చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. సమంత, శ్రద్ధా కపూర్‌తో పాటు టాలీవుడ్, బాలీవుడ్ టాప్ హీరోయిన్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ.. ఆఖరికి శ్రీలీల ఓకే అయ్యింది.

డ్యాన్స్ క్వీన్‌గా శ్రీలీల

టాలీవుడ్‌లో అమేజింగ్ డ్యాన్సర్‌గా, ఎక్స్ ప్రెషన్ క్వీన్‌గా పేరొందిన శ్రీలీల.. ఇప్పటికే తన డ్యాన్స్‌తో ఎన్నో పాటలని సూపర్ హిట్‌గా మలిచింది. అలాంటి శ్రీలీలకి ఐటెం సాంగ్ దొరికితే.. అంతకుమించి అనేలా స్టెప్‌లు వేయడం ఖాయం. మరి అల్లు అర్జున్‌తో కలిసి శ్రీలీల రొమాంటిక్ స్టెప్‌లు చూడాలంటే డిసెంబరు 5వ వరకు ఆగాల్సిందే.

సాధారణంగా శ్రీలీల ఒక్కో సినిమాకు కోటి రూపాయల వరకూ పారితోషికం తీసుకుంటుందని టాక్. కానీ.. పుష్ప-2లో ఐటెం సాంగ్ కోసం ఈ భామ రూ.1.50 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో శ్రీలీల డ్యాన్స్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా.. పుష్ప-2 నిర్మాతలు అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.

Whats_app_banner