కిస్సింగ్ సీన్ల వల్లే ఆ సినిమాలు చేయలేదు.. అమ్మా, నాన్న మాత్రం ఏం ఫర్వాలేదు చేయమన్నారు: హీరోయిన్ కామెంట్స్-actress sonam bazwa reveals she rejected movies because of kissing scenes but parents were ok with it ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కిస్సింగ్ సీన్ల వల్లే ఆ సినిమాలు చేయలేదు.. అమ్మా, నాన్న మాత్రం ఏం ఫర్వాలేదు చేయమన్నారు: హీరోయిన్ కామెంట్స్

కిస్సింగ్ సీన్ల వల్లే ఆ సినిమాలు చేయలేదు.. అమ్మా, నాన్న మాత్రం ఏం ఫర్వాలేదు చేయమన్నారు: హీరోయిన్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

తెలుగులో వెంకటేశ్ తో బాబు బంగారం సినిమాలో నటించిన సోనమ్ బజ్వా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కిస్సింగ్ సీన్లు చేయాల్సి ఉండటంతో తాను కొన్ని సినిమాలను వదులుకున్నానని, అయితే తన పేరెంట్స్ మాత్రం దీనిని పెద్దగా పట్టించుకోలేదని చెప్పడం విశేషం.

కిస్సింగ్ సీన్ల వల్లే ఆ సినిమాలు చేయలేదు.. అమ్మా, నాన్న మాత్రం ఏం ఫర్వాలేదు చేయమన్నారు: హీరోయిన్ కామెంట్స్

నటి సోనమ్ బజ్వా ఒకప్పుడు కిస్సింగ్ సీన్‌లు ఉన్నాయనే కారణంతో అనేక బాలీవుడ్ ఆఫర్‌లను తిరస్కరించినట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం తనపై తనకు ఉన్న నమ్మకం కంటే ఎక్కువగా భయం, సెల్ఫ్ డౌట్ వల్ల తీసుకున్నవే అని ఆమె చెప్పింది. అయితే ఆ తర్వాత తన పేరెంట్స్ కు ఇదే విషయం చెబితే సినిమా కోసమే కదా చేసినా ఫర్వాలేదనడంతో తాను షాక్ తిన్నట్లు సోనమ్ తెలిపింది.

సోనమ్ బజ్వా ఏమన్నదంటే?

ఫిల్మ్ కంపానియన్ తో సోనమ్ బజ్వా మాట్లాడింది. తెలుగులో వెంకటేశ్ తో కలిసి బాబు బంగారం మూవీతోపాటు ఆటాడుకుందాం రా అనే మరో సినిమా కూడా ఆమె చేసింది. ఈ పంజాబీ స్టార్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న భయాలను ఈ ఇంటర్వ్యూలో వివరించింది. స్క్రీన్ పై తాను ఇంటిమేట్ సీన్లలో నటిస్తే పంజాబ్ లోని ప్రేక్షకులు ఏమనుకుంటారో అని అనుకునేదానినని చెప్పింది.

"పంజాబ్‌లో అందరూ ఓకే అంటారా అని ఆలోచించి, నేను బాలీవుడ్‌లో కొన్ని ఆఫర్‌లను వదులుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు కదా అనే మనస్తత్వం నాకు ఉంది. ఆ సమయంలో కిస్సింగ్ సీన్ చేయడానికి నేను చాలా భయపడ్డాను. 'వాళ్లు దీనికి ఎలా స్పందిస్తారు? నన్ను ఇంతటిదాన్ని చేసిన వారు ఎలా రియాక్ట్ అవుతారు? ఇది కేవలం సినిమా కోసమే అని మా కుటుంబం అర్థం చేసుకుంటుందా?' అనే ప్రశ్నలన్నీ నా మనసులో ఉండేవి" అని సోనమ్ చెప్పింది.

తన ఎదుగుదలకు, సాంస్కృతిక మూలాలకు గౌరవం ఇస్తూ తనకంటూ కొన్ని పరిమితులను ఏర్పరచుకున్నానని, మొదటి నుంచీ తనకు సపోర్ట్ చేస్తున్న వారిని నిరాశపరచకూడదని తాను భావించినట్లు తెలిపింది.

తల్లిదండ్రులతో అలా అనడంతో..

అయితే ఈ విషయంపై తన తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడిన తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారినట్లు సోనమ్ వివరించింది. "కొన్ని సంవత్సరాల కిందట.. నేను చివరకు ఈ విషయం గురించి మా అమ్మ, నాన్నతో మాట్లాడాను. అప్పుడు వాళ్ళు స్పందిస్తూ.. 'అవును, సినిమా కోసం అయితే ఫర్వాలేదు' అన్నారు. నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను.

'నేను ఎందుకు ఇంతకు ముందే వారితో మాట్లాడలేదు?' అని ఆలోచించాను. మనం చాలా ఊహించుకుంటాం. ఈ విషయాన్ని లేవనెత్తడానికి కూడా నేను సిగ్గుపడ్డాను. కానీ వాళ్ళు మాత్రం ఫర్వాలేదు, సినిమా కోసమే కదా సమస్యే లేదు అని అన్నారు" అని సోనమ్ తెలిపింది.

సోనమ్ బజ్వా కెరీర్ ఇలా..

సోనమ్ బజ్వా తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించి, పంజాబీ చిత్రం 'బెస్ట్ ఆఫ్ లక్' (2013) తో నటిగా అరంగేట్రం చేసింది. 'పంజాబ్ 1984' (2014) తో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. సహజమైన నటనకు, భావోద్వేగ లోతుకు ప్రశంసలు అందుకుంది.

ఆ తర్వాత ఆమె 'నిక్కా జైల్‌దార్', 'క్యారీ ఆన్ జట్టా 3', 'సర్దార్ జీ' వంటి హిట్‌లతో పంజాబీ సినిమాలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్‌లలో ఒకరుగా ఎదిగింది. సోనమ్ తెలుగులో బాబు బంగారం, ఆటాడుకుందాం రా.. హిందీలో 'స్ట్రీట్ డ్యాన్సర్ 3D', 'కరమ్ యుద్ధ్' వంటి చిత్రాలలో నటించింది. ఆమె చివరిగా అక్షయ్ కుమార్ 'హౌస్‌ఫుల్ 5' లో కనిపించింది. ఆమె తదుపరి చిత్రం 'ఏక్ దీవానే కీ దీవానీయత్' అక్టోబర్ 21న విడుదల కానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం