Naga Chaitanya Wedding Card: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వెడ్డింగ్ కార్డ్.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఆ పేర్లు
Sobhita Dhulipala Naga Chaitanya Wedding Card: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. పెళ్లి పనులు ఇప్పటికే ఇరు కుటుంబాల్లోనూ ప్రారంభవగా.. వివాహ ఆహ్వాన పత్రికలను పంచుతున్నారు.
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో ఆదివారం ఉదయం నుంచి చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది ఆగస్టులో ఇద్దరూ నిశ్చితార్థం చేసుకోగా.. డిసెంబరు 4న వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ మేరకు అతిథులకి ఆహ్వాన పత్రికలను అక్కినేని, ధూళిపాళ్ల కుటుంబ సభ్యులు పంపుతున్నారు.
హైదరాబాద్‌లోనే పెళ్లి
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ పెళ్లి జరగబోతుండగా.. టాలీవుడ్‌లోని ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌కి సినిమా సెట్‌ను రూపొందించే బాధ్యతను అక్కినేని నాగార్జున అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే బంధువులతో పాటు అతిథులను పిలవాలని అక్కినేని, ధూళిపాళ్ల కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
స్పెషల్ అట్రాక్షన్‌గా పేర్లు
నాగచైతన్య, శోభిత వెడ్డింగ్ కార్డులో వధూవరుల తల్లిదండ్రులతో పాటు వాళ్ల తాతయ్యలు, బామ్మల పేర్లని కూడా ముద్రించారు. ఈ మేరకు కార్డుతో పాటు స్పెషల్ గిఫ్ట్స్‌ను కూడా బంధువులు, సన్నిహితుల కోసం పంపిణీ చేస్తున్నట్లు ఫొటోల్ని చూస్తే అర్థమవుతోంది. వెడ్డింగ్ కార్డుతో పాటు ఒక అందమైన చీర, పసుపు, కుంకుమ, ఒక ప్రత్యేకమైన వెండి వస్తువుని కూడా పంపిస్తున్నారు.
పిల్లల గురించి మాట్లాడిన చైతన్య
ఇటీవల నాగచైతన్య.. పెళ్లి, పిల్లల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. పెళ్లి చేసుకోవడం, ఇద్దరు పిల్లలతో లైఫ్ హ్యాపీ అంటూ చెప్పుకొచ్చారు. గతంలో సమంతని వివాహం చేసుకున్న నాగచైతన్య.. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా.. సమంత కూడా ఇటీవల మాతృత్వం గురించి మాట్లాడుతూ.. తనకి తల్లి కావాలని ఉందంటూ చెప్పడం గమనార్హం.
నెక్ట్స్ ఇయర్ తండేల్ రిలీజ్
నాగచైతన్య నటించిన తండేల్ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న రిలీజ్‌కానుంది. ఈ సినిమాలో చైతన్యకి జంటగా సాయి పల్లవి నటించగా.. మత్స్యకారుల నేపథ్యంతో దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించారు.