ఆంటీ పాత్రలు చేసినందుకు ఇండస్ట్రీలోని ఓ ఫ్రెండ్ తనను హేళన చేసిన సంఘటన గురించి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ఇటీవల వివరించింది. ఆ కామెంట్స్‌లలో 'డబ్బా పాత్రలు' అనే పదాన్ని ఉపయోగించింది హీరోయిన్ సిమ్రాన్. దీంతో ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడమే కాకుండా చర్చనీయాంశంగా మారాయి.
అయితే ఆ డబ్బా పాత్రలు అనే పదం నెట్‌ప్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన డబ్బా కార్టెల్ సిరీస్‌లో నటించిన జ్యోతికను ఉద్దేశించే అన్నారని సిమ్రాన్‌పై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. ఆ కామెంట్స్ జ్యోతికపై సెటైరికల్‌గా చాలా మంది తీసుకున్నారు. దీంతో ఇప్పుడు తాజాగా ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చింది హీరోయిన్ సిమ్రాన్.
తాజాగా సిమ్రాన్ 'ఆంటీ పాత్రలు' చేసినందుకు ఇండస్ట్రీలోని తన కో యాక్టర్, ఫ్రెండ్ తనను ఎలా హేళన చేశాడో వివరించింది. సిమ్రాన్ వివరణ ఇస్తూ "అప్పుడు నేను చాలా కలత చెందాను. నేను నా భావాలను పంచుకున్నాను అంతే. కెరీర్ ఆరంభం నుంచి ఆంటీ పాత్రలు చేస్తూ వస్తున్నానని, ఇది నాకు ఇష్టం అని అన్నారు. ఆంటీ పాత్రలు చేయడం చెడ్డ విషయం కాదు" అని అన్నారు.
"అయితే ఈ సంఘటన నాకు చేదు జ్ఞాపకాన్ని ఇచ్చింది. మహిళా తారలు (హీరోయిన్స్) స్నేహితులు కాలేరు. ఇండస్ట్రీలో నటీమణులు స్నేహితులుగా ఉంటారని నేను అనుకోవడం లేదు. ఈ ఘటనే రుజువు చేసింది. స్నేహితులు మిమ్మల్ని బాధపెట్టినప్పుడు చాలా బాధగా ఉంటుంది. మరుసటి రోజు ఆ వ్యక్తి నాతో మాట్లాడారు. కానీ, నాకు అదంతా సౌకర్యంగా లేదు" అని సిమ్రాన్ తెలిపింది.
ఇకపోతే గత వారం జేఎఫ్‌డబ్ల్యూ మూవీ అవార్డ్స్‌లో సిమ్రాన్ "నేను ఆంటీ రోల్స్ చేస్తున్నానంటే నా ఫ్రెండ్ నమ్మలేకపోయింది. అది నన్ను కలచివేసింది. ఆంటీ పాత్రలు చేస్తే బాగుంటుందనిపించింది. అయితే, ప్రాధాన్యత ఉన్న పాత్రలు" అని మాట్లాడింది.
"25 ఏళ్ల పిల్లలకు తల్లిగా, మీకు కూడా తెలుసు నేను కన్నతిల్ ముత్తమిట్టల్ వంటి సినిమాల్లో ఎందుకు పనికి రాని డబ్బా పాత్రలు సైతం చేశాను అని. మనమందరం ఏమి చేయాలనుకుంటున్నామో దానిపై ఆత్మవిశ్వాసంతో ఉండాలి. దీనికి నేను అర్హుడిని కాదు. దీన్ని నేనే సొంతంగా సంపాదించాను. అది ఆంటీ పాత్ర అయినా, తల్లి పాత్ర అయినా. ఏ పాత్ర అయినా ఇది నా ఇష్టం. ఇది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది" అని సిమ్రాన్ కామెంట్స్ చేసింది.
అయితే, సిమ్రాన్‌తో అలా అన్న నటి ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. అది ఎవరా అని నెటిజన్స్ వెతకడం స్టార్ట్ చేశారు. అయితే, అది శబ్దం సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న లైలా గురించి మాట్లాడుతున్నారని కొందరు భావించారు. మరికొందరైతే గుడ్ బ్యాడ్ అగ్లీలో నటించిన త్రిషనే అనుకున్నారు.
'డబ్బా' అనే పదం ఉపయోగించి సిమ్రాన్ డబ్బా కార్టెల్‌ను ఉద్దేశిస్తూ జ్యోతిక గురించే మాట్లాడిందని మరికొందరు భావించారు. కాగా, సిమ్రాన్ ఎక్కువగా బాలకృష్ణతో నరసింహా నాయుడు, సమర సింహా రెడ్డి, ఒక్క మగాడు సీమ సింహం, గొప్పింటి అల్లుడు వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది.
సంబంధిత కథనం