నా పెళ్లికి పిలుద్దామనుకున్న ఒకే ఒక్క హీరోయిన్ ఆమె- కానీ, చూసేందుకు బూడిద తప్పా ఏం లేదు- సీనియర్ హీరోయిన్ రాశి ఎమోషనల్-actress raasi comments on soundarya death and bonding her marriage competition in varsha kissik talk show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నా పెళ్లికి పిలుద్దామనుకున్న ఒకే ఒక్క హీరోయిన్ ఆమె- కానీ, చూసేందుకు బూడిద తప్పా ఏం లేదు- సీనియర్ హీరోయిన్ రాశి ఎమోషనల్

నా పెళ్లికి పిలుద్దామనుకున్న ఒకే ఒక్క హీరోయిన్ ఆమె- కానీ, చూసేందుకు బూడిద తప్పా ఏం లేదు- సీనియర్ హీరోయిన్ రాశి ఎమోషనల్

Sanjiv Kumar HT Telugu

సీనియర్ హీరోయిన్ రాశి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి స్టార్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న రాశి తనకు చాలా ఇష్టమైన మరో హీరోయిన్ మరణం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా చేస్తున్న కిస్సిక్ టాక్ షోలో హీరోయిన్ రాశి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నా పెళ్లికి పిలుద్దామనుకున్న ఒకే ఒక్క హీరోయిన్ ఆమె- కానీ, చూసేందుకు బూడిద తప్పా ఏం లేదు- సీనియర్ హీరోయిన్ రాశి ఎమోషనల్

సీనియర్ హీరోయిన్ రాశి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన రాశి ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టారు. అందం, అభినయం, గ్లామర్ షో అన్ని విధాల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం రాశి సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

కిస్సిక్ టాక్ షో

అయితే, సినీ ఇండస్ట్రీలో తనకు చాలా ఇష్టమైన మరో హీరోయిన్ మరణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు రాశి. జబర్దస్త్ బ్యూటీ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో కిస్సిక్. ఈ షోలో యాంకర్ ప్రశ్నలు అడిగే సందర్భంలో తన పెళ్లికి పిలవాలనుకున్న హీరోయిన్ చనిపోవడం గురించి చెబుతూ కంటతడి పెట్టుకున్నారు రాశి.

"మీరు నటించేటప్పుడు సినీ ఇండస్ట్రీలో నాకు పోటీ అని అనుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా" అని వర్ష అడిగింది. "సౌందర్య స్టాఫ్ మా స్టాఫ్‌తోటి.. అంటే అప్పుడు ఆవిడ పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం సీరియల్స్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు" అని రాశి చెప్పారు. "ఎవరు సౌందర్య గారు" అని వర్ష అడిగింది.

కొట్టేవాళ్లే లేరనుకున్నాం

"అవును సౌందర్య గారు. సౌందర్య గారి స్టాఫ్ మా స్టాఫ్‌తో అన్నారట. మా మేడమ్‌ను కొట్టేవాళ్లే లేరనుకున్నాం. మీ మేడమ్ వచ్చిందే. అలా మాట్లాడుకునేవారట. నాకు చెబుతారు కదా స్టాఫ్" అని రాశి చెబుతుంటే యాంకర్ వర్ష ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది.

"ప్రశాంత్ కుటీర్ అని గెస్ట్ హౌజ్. అక్కడ నాది సౌందర్య గారిది ఎదురెదురు రూమ్సే. ఆవిడది రూమ్ నెంబర్ 10.. నాది రెండో ఏదో ఉండేది. అపోజిట్‌లోనే ఉండేవాళ్లం. తర్వాత ఆవిడ పెళ్లి చేసుకుని వెళ్లిపోయాక ఆమె రూమ్ నేను వాడుకున్నా. మంచి ఫ్రెండ్స్ మేము" అని సౌందర్య గురించి హీరోయిన్ రాశి చెప్పారు.

చిన్న పిల్లను చూసినట్లే

"సౌందర్య గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది" అని వర్ష అడిగింది. "బాగుంటది. ఆవిడ కంటే నేను చాలా చిన్నదాన్ని ఏజ్‌లో. అందుకని ఓ చిన్న పిల్లను చూసినట్లే చూసేది. ఓ సిస్టర్‌లా చూసినట్లు, మా అన్నయ్యను ఓ బ్రదర్‌లా చూసినట్టు. చాలా తక్కువ మాట్లాడతారు ఆవిడ ఎక్కవ మాట్లాడరు" అని రాశి తెలిపారు.

"ఆవిడ లేరు అని తెలిసినప్పుడు" అని జబర్దస్త్ వర్ష అడుగుతుండగానే.. "చాలా బాధపడ్డాం. మ్యారేజ్‌కు పిలుద్దామనుకున్న ఒకే ఒక్క వ్యక్తి ఆవిడ. నన్ను పెళ్లి కూతురుని చేయబోతున్నారు. చేశారు.. చేసిన వెంటనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ సంతాప సభ పెట్టారు. అమ్మ వెళ్లొద్దన్నారు" అని హీరోయిన్ రాశి ఎమోషనల్‌గా వెల్లడించారు.

చూడటానికి ఏం లేదు

"పెళ్లి కూతురుని చేస్తే మనం బయటకు వెళ్లకూడదుగా. కానీ, నేను వెళ్తా.. నేను ఇప్పుడు బెంగళూరు వెళ్లి తనను చూడటానికి కూడా ఏం లేదు. కేవలం యాషే (బూడిద) ఉంది. సంతాప సభకు వెళ్లి ఆ ఫొటో చూసి, దండ వేసి, పూలు వేసి వస్తానని చెప్పి సంతాప సభకు వచ్చి మళ్లీ వెళ్లిపోయాను" అని సీనియర్ హీరోయిన్ రాశి చెప్పుకొచ్చారు.

"సంతాప సభలో" అంటూ వర్ష ఏదో అడగబోతుంటే.. "పెళ్లి టైమ్‌లోనే.. అప్పటికే పెళ్లి కూతురుని చేశారు" అని సీనియర్ హీరోయిన్ రాశి తెలిపారు. అలా సౌందర్యపై తనకున్న ఇష్టం, ఆమె మరణ వార్తతో కలిగిన బాధ గురించి యాంకర్ వర్ష కిస్సిక్ టాక్ షోలో వెల్లడించారు సీనియర్ హీరోయిన్ రాశి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం