Actress Pramodini On Annapurnamma: తెలుగు కమెడియన్ సప్తగిరి హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ పెళ్లి కాని ప్రసాద్. మల్లీశ్వరి మూవీలో వెంకటేష్ పేరుతో టైటిల్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించారు. ఇందులో సప్తగిరికి జోడీగా హీరోయిన్ ప్రియాంక శర్మ నటించింది.
అలాగే, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, ప్రమోదిని పెళ్లి కాని ప్రసాద్ మూవీలో కీలక పాత్రలు పోషించారు. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి ఈ సినిమాను నిర్మించారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ ఈ సినిమాను సమర్పిస్తోంది.
దిల్ రాజు నేతృత్వంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన పెళ్లికాని ప్రసాద్ టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా పెళ్లి కాని ప్రసాద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, అన్నపూర్ణమ్మ, ప్రమోదిని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నటి అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ.. "అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా చాలా సరదాగా ఉంటుంది. కడుపుబ్బా నవ్వేలా ఉంటుంది. మార్చి 21న మేమంతా వస్తున్నాం. సినిమా ఎలా ఉందో మీరు చూసి చెప్పాలి. డైరెక్టర్ గారు చిన్న కుర్రాడైనా చాలా అద్భుతంగా సినిమా తీశారు. సినిమా చూస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. సినిమా చాలా హ్యూమరస్‌గా ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా ఇది" అని తెలిపారు.
నటి ప్రమోదిని మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ఈ సినిమా మార్చి 21న వస్తున్నాం, అందర్నీ చాలా నవ్విస్తున్నాం. నాకు ఇంట్లో ఈ సినిమా చాలా మంచి మైలేజ్ ఇస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో కామెడీ రోల్ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ అభిలాష్ రెడ్డికి థాంక్యూ. అన్నపూర్ణమ్మ గారితో కలిసి చేస్తున్న ఫస్ట్ సినిమా ఇది. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. సప్తగిరి గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది" అని పేర్కొన్నారు.
"మీడియా అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరికీ థాంక్యు. మా ప్రొడ్యూసర్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. ఆయనకి చాలా థాంక్యూ. అందరూ మార్చ్ 21 థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను" అని డైరెక్టర్ అభిలాష్ రెడ్డి అన్నారు.
"ఈ సినిమా కథ, కామెడీ చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. మా టీజర్ రిలీజ్ చేసిన ప్రభాస్ గారికి, ట్రైలర్ రిలీజ్ చేసిన వెంకటేష్ గారికి, దిల్ రాజు, శిరీష్ గారికి, మారుతి గారికి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యు. మార్చి 21న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా వచ్చి చూడాలి" అని నిర్మాత కైవై బాబు కోరారు.
సంబంధిత కథనం