నా సీన్ వస్తుంటే వాళ్లు కళ్లు మూసుకునేలా ఉండకూడదు.. హీరోయిన్ నిహారిక కామెంట్స్-actress niharika nm comments on her parents and tollywood industry over debut by priyadarshi mithra mandali movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నా సీన్ వస్తుంటే వాళ్లు కళ్లు మూసుకునేలా ఉండకూడదు.. హీరోయిన్ నిహారిక కామెంట్స్

నా సీన్ వస్తుంటే వాళ్లు కళ్లు మూసుకునేలా ఉండకూడదు.. హీరోయిన్ నిహారిక కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

తెలుగులోకి సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్, యూట్యూబర్ నిహారిక ఎన్ఎమ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. నిహారిక హీరోయిన్‌గా చేసిన మిత్ర మండలి మూవీలో హీరోగా ప్రియదర్శి చేశాడు. విజయేందర్ దర్శకత్వం వహించిన మిత్ర మండలి సినిమా విశేషాలను, పర్సనల్ విషయాలను హీరోయిన్ నిహారిక చెప్పుకొచ్చింది.

నా సీన్ వస్తుంటే వాళ్లు కళ్లు మూసుకునేలా ఉండకూడదు.. హీరోయిన్ నిహారిక కామెంట్స్

సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా, యూట్యూబర్‌గా చాలా ఫేమస్ అయింది బ్యూటిఫుల్ నిహారిక ఎన్ఎమ్. ఇన్‌స్టాగ్రామ్‌లో కడుపుబ్బా నవ్వించే కామెడీ వీడియోలు, రీల్స్ చేసి నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది నిహారిక ఎన్ఎమ్. అలాగే, టాలీవుడ్ పెద్ద హీరోలతో కొలబారేషన్ వీడియోలు సైతం చేసి అట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

మహేశ్ బాబు-యశ్‌తో

మహేశ్ బాబు, అడవి శేష్‌తో మేజర్ సినిమా, విజయ్ దేవరకొండతో లైగర్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కంటెంట్ వీడియోలు చేసిన నిహారిక కన్నడ స్టార్ హీరో యశ్‌తో కూడా చేసింది. ఇలా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న నిహారిక ఎన్ఎమ్ తమిళంలో పెరుసు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తెలుగులో హీరోయిన్‌గా అలరించడానికి రెడీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

తెలుగులో ఎంట్రీ మూవీ

నిహారిక ఎన్ఎమ్ హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇస్తున్న సినిమా మిత్ర మండలి. ఈ మూవీలో హీరోగా ప్రియదర్శి చేశాడు. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించారు.

నిహారిక కామెంట్స్

అక్టోబర్ 16న మిత్ర మండలి సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ నిహారిక ఎన్ఎమ్ ఇంట్రెస్టింగ్ విషయాలు, కామెంట్స్ చేసింది.

తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేశారు. టాలీవుడ్ గురించి మీకు ఏర్పడిన అభిప్రాయం ఏంటి? ఎలాంటి చిత్రాల్ని మున్ముందు చేయాలని అనుకుంటున్నారు?

-ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం ఎదురవుతుంది. బయట ప్రపంచంలో ఇండస్ట్రీ గురించి మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన హద్దుల్లో మనం ఉంటే ఏమీ కాదు. తెరపై నన్ను మా ఫ్యామిలీ హాయిగా చూసుకునేలా ఉండాలి. నా సీన్ వస్తుంటే వాళ్లు కళ్లు మూసుకునేలా ఉండకూడదు.

‘మిత్ర మండలి’ చిత్రం ఎలా ఉంటుంది? ఈ మూవీ నుంచి ఆడియెన్స్ ఏం ఆశించి థియేటర్‌కు రావాలి?

-‘మిత్ర మండలి’ చిత్రంలో కథ, కథనం చాలా కొత్తగా ఉంటుంది. అందరినీ నవ్వించేలా మా చిత్రం ఉంటుంది. థియేటర్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరినీ హాయిగా నవ్వించేస్తుంది.

‘మిత్ర మండలి’ దర్శక, నిర్మాతల గురించి చెప్పండి?

-తెలుగు చిత్ర సీమ నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించింది. దర్శక, నిర్మాతలు నన్ను సొంత ఫ్యామిలీలా చూసుకున్నారు. టాలీవుడ్‌లో దొరికినంత ప్రేమ, కంఫర్ట్ నాకు ఇంకెక్కడా దొరకలేదు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం