Nazriya: తెలుగులో ఈ హీరోలతో తప్పకుండా చేస్తా.. నజ్రియా ఆసక్తికర వ్యాఖ్యలు-actress nazriya told likes to work with mahesh ntr and ram charan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nazriya: తెలుగులో ఈ హీరోలతో తప్పకుండా చేస్తా.. నజ్రియా ఆసక్తికర వ్యాఖ్యలు

Nazriya: తెలుగులో ఈ హీరోలతో తప్పకుండా చేస్తా.. నజ్రియా ఆసక్తికర వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Published Jun 08, 2022 11:54 AM IST

అంటే సుందరానకి చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేస్తున్న నజ్రియా నజీమ్ తన గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తెలుగులో తన నటించాలనుకుంటున్న హీరోల గురించి తెలియజేసింది.

<p>నజ్రియా నజీమ్&nbsp;</p>
నజ్రియా నజీమ్ (Twitter)

నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమా ద్వారా తెలుగులో తొలిసారిగా పరిచయమవుతోంది మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్. రాజా రాణి అనే డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగువారికి సుపరిచితమైన నజ్రియా.. అనంతరం సినిమాలకు గ్యాప్ తీసుకుంది. నానితో నటించిన అంటే సుందరానికి సినిమాలో లీలా థామస్ అనే పాత్రను పోషించింది. ఈ చిత్రం ఈ నెల జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నజ్రియా ఆసక్తికర విషయాలను పంచుకుంది.

తెలుగులో ఓ స్టార్ హీరోతో వర్క్ చేయాలనుందని అడిగిన ప్రశ్నకు.. "నేనెంతో స్వార్థపరురాలిని. నేను జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్ ఇలా అందరితోనూ కలిసి పనిచేయాలనుంది" అని తెలిపింది. అంతేకాకుండా అంటే సుందరానికి దర్శకుడు వివేక్ ఆత్రేయతోనూ కుదిరితే మరోసారి పనిచేయాలని ఉందని స్పష్టం చేసింది. ఆయన సినిమా రూపొందించే విధానం, నేరేషన్ పద్ధతిని చూసి ప్రేరణ పొందినట్లు తెలిపింది.

రాజారాణి తర్వాత తెలుగులో ఇన్ని రోజులు సినిమా చేయకపోవడానికి కారణమేంటని అడిగిన ప్రశ్నకు.. కథల ఎంపికలో తాను ఆచి తూచి వ్యవహరిస్తుంటానని, తెలుగులోనూ చేయాలని ఉందని, కాకపోతే సరైన కథే దొరకలేదని స్పష్టం చేసింది. అంటే సుందరానికి వచ్చే సరికి ఇందులో చాలా ఫన్ ఉందని తెలిపింది.

ఈ చిత్రానికి బ్రోచేవారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు. నజ్రియా నజీమ్ ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. జూన్ 10న తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం