Nayanthara: విఘ్నేష్ శివన్‌ని ముద్దులతో ముంచెత్తిన నయనతార.. రొమాంటిక్ డిన్నర్ ఫొటోలు షేర్
Director Vignesh Shivan Birthday: లేడీ సూపర్ స్టార్ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ పుట్టిన రోజు సందర్భంగా రొమాంటిక్ డిన్నర్‌కి ప్లాన్ చేసింది. అర్ధరాత్రి ఈ జంట రెస్టారెంట్‌లో ముద్దులు పెట్టుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Nayanthara and Vignesh Shivan: సీనియర్ హీరోయిన్ నయనతార తన భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని ముద్దులతో ముంచెత్తింది. సెప్టెంబరు 18 (ఈరోజు) 39వ వసంతంలోకి విఘ్నేష్ శివన్ అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా బర్త్ డే డిన్నర్‌కు సంబంధించిన ఫోటోలను నయనతార తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది.
డిన్నర్ ఫొటోల్లో నయనతార, విఘ్నేష్ ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నారు. నయన్ ఆలివ్ గ్రీన్ జాకెట్ కింద బ్లాక్ టాప్ ధరించగా, విఘ్నేష్ బ్లాక్ టీ షర్ట్ ధరించాడు. పక్కపక్కనే కూర్చుని నవ్వులూ పూయిస్తూ ఈ జంట కెమెరాకి ఫోజులిచ్చింది. డిన్నర్‌ని ఈ జంట బాగా ఆస్వాదిస్తున్నట్లు ఆ ఫొటోల్లో కనిపిస్తోంది.
రెండేళ్ల క్రితం వివాహం
నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల వివాహం2022 జూన్ 9న జరిగింది. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకి సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, అజిత్ కుమార్, విజయ్ సేతుపతి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 2022 అక్టోబర్‌లో సరోగసీ ద్వారా ఉయిర్, ఉలగ్ అనే కవల పిల్లలకి ఈ జంట పేరెంట్స్ అయ్యారు.
మలయాళం సినిమాలతో నయన్ బిజీ
నయనతార ప్రస్తుతం మలయాళం సినిమాలో నటిస్తోంది. కొత్త దర్శకులు సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్ దర్శకత్వంలో డియర్ స్టూడెంట్స్ అనే చిత్రంలో నటిస్తోంది. పౌలీ జూనియర్ పిక్చర్స్, రౌడీ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
నయనతార చివరిసారిగా 2022లో వచ్చిన గోల్డ్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి నటించింది. గత ఏడాది షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి కూడా నయనతారం ఎంట్రీ ఇచ్చింది. కానీ గత కొంతకాలంగా తెలుగు సినిమాలకి మాత్రం నయనతార దూరంగా ఉంటోంది.
దక్షిణాదిన టాప్ హీరోయిన్లలో ఒకరిగా గత కొన్నేళ్లుగా నుంచి నయనతార తన హవాని కొనసాగిస్తోంది. రజనీకాంత్ సినిమా చంద్రముఖితో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ వెంకటేశ్ మూవీ లక్ష్మితో టాలీవుడ్‌లో పాగా వేసింది. ఇక అక్కడి నుంచి టాప్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగింది. హీరోయిన్‌గా మంచి పొజీషన్‌లో ఉన్న సమయంలోనే తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని.. ఏడాది వ్యవధిలోనే ఇద్దరు పిల్లలకి తల్లయ్యింది.