Nayanthara vs Dhanush: హీరో ధనుష్‌కి మాస్ వార్నింగ్ ఇచ్చిన నయనతార? గుర్తు పెట్టుకో వడ్డీ సహా తిరిగిచ్చేస్తా!-actress nayanthara cryptic post on karma amid rift with dhanush leaves fans wondering ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nayanthara Vs Dhanush: హీరో ధనుష్‌కి మాస్ వార్నింగ్ ఇచ్చిన నయనతార? గుర్తు పెట్టుకో వడ్డీ సహా తిరిగిచ్చేస్తా!

Nayanthara vs Dhanush: హీరో ధనుష్‌కి మాస్ వార్నింగ్ ఇచ్చిన నయనతార? గుర్తు పెట్టుకో వడ్డీ సహా తిరిగిచ్చేస్తా!

Galeti Rajendra HT Telugu
Nov 29, 2024 05:22 PM IST

Nayanthara Cryptic Post: హీరో ధనుష్ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ వరుసగా తన లాయర్‌ ద్వారా నయనతారకి నోటీసులు పంపిస్తున్నాడు. దాంతో చిరెత్రిపోయిన నయన్.. ఘాటుగా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది.

ధనుష్, నయనతార
ధనుష్, నయనతార

లేడీ సూపర్ స్టార్ నయతార, హీరో ధనుష్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఇటీవల నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఆమె బయోగ్రఫీ ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ పేరుతో ఒక డాక్యుమెంటరీ రూపంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది.

ప్రొడ్యూసర్‌గా ధనుష్ నోటీసులు

ఈ డాక్యుమెంటరీలో నయనతార నటించిన ‘నేనూ రౌడీనే’ సినిమాలోని 3 సెకన్ల క్లిప్‌ను వాడారు. దాంతో ఎలాంటి అనుమతి లేకుండా ఆ క్లిప్‌ను వాడుకున్నందుకు కాపీ రైట్ కింద రూ.10 కోట్లు చెల్లించాలని నయనతారకి తొలుత ధనుష్ నోటీసులు పంపించాడు. నేనూ రౌడీనే సినిమాకి నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా.. విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. ఈ మూవీకి ధనుష్ ప్రొడ్యూసర్.

బహిరంగ లేఖతో నయన్ సమాధానం

డాక్యుమెంటరీ రిలీజ్‌కి ముందే ధనుష్ నోటీసులు పంపగా.. సోషల్ మీడియాలో బహిరంగ లేఖతో నయనతార సమాధానమిచ్చింది. ఈ క్రమంలో ధనుష్‌ నుంచి నిరభ్యంతర పత్రం కోసం చాలా రోజులు వేచి చూశామని.. అతను ఏదో మనసులో పెట్టుకుని ఇలా వేధింపులకి దిగుతున్నట్లు నయనతార అందులో రాసుకొచ్చింది. అలానే చట్టపరంగానే ఆ నోటీసులకి సమాధానమిస్తానని చెప్పింది.

డాక్యుమెంటరీలోనూ ఆ క్లిప్‌ను అలానే నయన్ కొనసాగించింది. దాంతో ధనుష్ రోజుల వ్యవధిలోనే తన లాయర్ ద్వారా వరుసగా నోటీసులు పంపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. నయనతార మళ్లీ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. అయితే.. ఈసారి అతని పేరుని ప్రస్తావించలేదు. కానీ.. ఆ మాటలు మాత్రం ధనుష్‌కే కనెక్ట్ అవుతున్నాయి.

కర్మ సిద్ధాంతాన్ని కోట్ చేసిన నయన్

‘‘పక్క వారి జీవితాన్ని అబద్ధాలతో మీరు నాశనం చేస్తుంటే.. దాన్ని మీరు అప్పుగా భావించండి. ఎందుకంటే.. ఏదో ఒక రోజు మీకు అది వడ్డీతో సహా తిరిగి వస్తుంది.. గుర్తు పెట్టుకోండి’’ అని కర్మ సిద్ధాంతాన్ని తన సోషల్ మీడియాలో నయనతార పోస్ట్ చేసింది.

ఈ కొటేషన్ ధనుష్‌ని ఉద్దేశించేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సౌత్‌లో ఇప్పటికీ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార.. ఇటీవల బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలకి సంతకం చేస్తోంది. షారూక్ ఖాన్‌తో కలిసి నయన్ నటించిన జవాన్ మూవీ అవ్వడంతో ఈ అమ్మడికి అక్కడ అవకాశాలు పెరిగాయి.

వివాదం ఒకవైపు.. విడాకులు మరోవైపు

ధనుష్‌ ఒకవైపు నయనతారతో వివాదం ఎదుర్కొంటూనే.. మరోవైపు వైవాహిక జీవితంలోనూ ఇబ్బందుల్ని చవిచూస్తున్నాడు. రెండు దశాబ్దాల వైవాహిక బంధానికి తెరదించుతూ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో ధనుష్ ఇటీవల విడాకులు తీసుకున్నాడు. దాంతో ధనుష్‌కి ఈమధ్య ఏదీ కలిసిరావట్లేదని అతని అభిమానులు సోషల్ మీడియాలో సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Whats_app_banner