Meena Marriage: మీనా రెండో పెళ్లిపై జర్నలిస్ట్ తింగరి ప్రశ్నలు.. ఊహించని ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్
Meena Second Marriage: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా రెండో పెళ్లిపై ఇప్పటికీ అనేక రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మీనా రెండో పెళ్లిపై ఓ జర్నలిస్ట్ తింగరి ప్రశ్నలు వేయగా అతనికి ఊహించని విధంగా సమాధానం ఇచ్చారు.
Meena About Second Marriage: ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగారు నటి మీనా. ఇప్పుడు ప్రాధాన్యత గల పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. అయితే, ఇటీవల మీనా భర్త అకస్మాత్తుగా చనిపోయిన విషయం తెలిసిందే. భర్త మరణం తర్వాత మీనా రెండో పెళ్లిపై అనేక రూపర్స్, వార్తలు వచ్చాయి. మీనా రెండో పెళ్లి చేసుకోనుందని తెగ ప్రచారం కూడా జరిగింది. తాజాగా మీనా రెండో వివాహంపై ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సీనియర్ నటి మీనా. ఆ ఇంటర్వ్యూలో "అందంగా ఉన్నారు.. వయసు కూడా తక్కువే ఉంది. రెండో పెళ్లి చేసుకుంటారా?" అని ఒకే ప్రశ్నను పదే పదే, తిప్పి తిప్పి తింగరగా, వంకరగా అడిగాడు ఓ జర్నలిస్ట్. ఈ ప్రశ్నకు ఊహించని విధంగా, మళ్లీ మాట్లాడేందుకు అవకాశం లేకుండా సమాధానం ఇచ్చారు సీనియర్ హీరోయిన్ మీనా.
"మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఇప్పటికైతే లేదు. ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతావా అంటే.. చాలా మంది అలా ఉంటున్నారు కదా. అలాగని నేను వాళ్లలాగే ఉంటానని కాదు. ఎవరి పరిస్థితి వాళ్లది. నా జీవితంలో నేను ఇదే చేస్తానని అనుకోలేదు. అలా ఎప్పుడూ చేయలేదు. తక్కువ వయసు.. ఎక్కువ వయసు.. అని కాదు. నా ఫ్యూచర్ గురించి నేను ఊహించలేను. నేనే కాదు ఎవరూ కూడా ఊహించలేరు" అని మీనా తెలిపారు.
"నేను మొదటి నుంచి నా భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. నేను సినిమాల్లోకి వస్తానని ఊహించలేదు. పెద్ద హీరోయిన్ అవుతాననీ అనుకోలేదు. తెలుగు, తమిళంలో టాప్ స్టార్స్‌తో హీరోయిన్‌గా చేస్తానన అస్సలు ఊహించలేదు. జీవితం ఇలాగే ఉంటుందని నేను ఊహించను. పెళ్లి కూడా అంతే.. అప్పుడు చేసుకుంటా.. ఇప్పుడు చేసుకుంటా.. అని చెప్పలేను. ఒంటరిగా ఉండిపోతానని కూడా చెప్పలేను. ఎందుకంటే నా భవిష్యత్తు గురించి నేను ప్లాన్ చేసుకోలేదు" అని మీనా పలు విధాలుగా ఆన్సర్ ఇచ్చారు.
"సింగిల్ ఉమెన్‌గా ఉండటం కష్టమేం కాదు కదా. రేపు ఏం జరుగుతుందో నాకు ఐడియా లేదు. నేను నా గురించి మాత్రమే కాదు. నా కూతురు (Meena Daughter Nainika) భవిష్యత్ గురించి కూడా ఆలోచించాలి. నా కూతురు నాకంటే ముఖ్యం. నా సుఖం, నా సంతోషం కాదు.. నా ఫస్ట్ ప్రియారిటీ నా కూతురు. నా కంఫర్ట్ మాత్రమే నేను చూసుకోను. ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు" అని మీనా చెప్పుకొచ్చారు.
"భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి. ఎదురు చూడటమే. నాకు నా కూతురు చాలా ముఖ్యం. ప్రస్తుతానికి నా మైండ్‌లో అదొక్కటే ఉంది. పెళ్లి చేసుకుంటా.. అప్పుడు చేసుకుంటా.. ఇప్పుడు చేసుకుంటా.. చేసుకోను.. అని నేనే ఊహించి చెప్పలేను" అని సూటిగా సమాధానం ఇచ్చారు హీరోయిన్ మీనా. ఇదిలా ఉంటే మీనా భర్త విద్యాసాగర్ పలు అనారోగ్యా కారణాలతో మరణించారు. కరోనా కారణంగా విద్యా సాగర్ ఆరోగ్యం చెడిపోయినట్లు గతంలో వైద్యులు తెలిపిన విషయం తెలిసిందే.