Jyothika Bollywood Movie : 2 దశాబ్దాల తర్వాత బాలీవుడ్‌లోకి జ్యోతిక-actress jyothika re entry in bollywood after 20 years ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jyothika Bollywood Movie : 2 దశాబ్దాల తర్వాత బాలీవుడ్‌లోకి జ్యోతిక

Jyothika Bollywood Movie : 2 దశాబ్దాల తర్వాత బాలీవుడ్‌లోకి జ్యోతిక

Anand Sai HT Telugu
May 16, 2023 08:05 AM IST

Actress Jyothika : సౌతిండియాలో హీరోయిన్ జ్యోతికకు మంచి పేరుంది. సుమారు 20 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తోంది. అజయ్ దేవ్ గన్, ఆర్.మాధవన్ తో స్ర్కీన్ ను షేర్ చేసుకోనుంది.

జ్యోతిక
జ్యోతిక (twitter)

రెండు దశాబ్దాల తర్వాత జ్యోతిక(Jyothika) బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. మంచి నటనతో జ్యోతిక ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సూర్యతో పెళ్లి తర్వాత సినిమాలకు కొన్నాళ్లు కాస్త దూరంగానే ఉంది. కుటుంబంపై దృష్టి పెట్టింది. పిల్లలు పెద్దయ్యాక మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించింది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత జ్యోతిక మళ్లీ బాలీవుడ్‌(Bollywood)లో నటించనుంది.

జ్యోతిక సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. ఆర్.మాధవన్(R Madhavan), అజయ్ దేవగన్‌లతో స్క్రీన్ ప్రెజెన్స్‌ను పంచుకోనుంది. ఈ చిత్రానికి వికాస్ బహల్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాధవన్ సరసన జ్యోతిక నటిస్తుందా లేక అజయ్ దేవగన్ సరసన నటిస్తుందా అనేది క్లారిటీ లేదు. ఈ చిత్రం జూన్ 2023లో సెట్స్ పైకి వెళ్లనుంది.

జ్యోతిక ఇటీవల రాజ్‌కుమార్ రావ్ శ్రీ సెట్స్‌లో కనిపించింది. ఈ చిత్రానికి తుషార్ హీరానందని దర్శకత్వం వహించారు. దృష్టి లోపం ఉన్న పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ఇది.

సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి జ్యోతిక వెండితెరకు పరిచయమైంది. హిందీ ఇండస్ట్రీతోనే కెరీర్ ప్రారంభించింది. ప్రియదర్శన్ తెరకెక్కించిన దొలీ సజా కే రక్నాలో నటించింది. ఈ చిత్రం 1997లో విడుదలైంది. జ్యోతిక తండ్రి చందర్ సదానా నిర్మాత, సోదరిలు నగ్మా, రోషిణిలు కూడా నటులే. 2006 సెప్టెంబర్ 11న సినీ నటుడు సూర్య(Surya)ను వివాహమాడింది. తెలుగులో రవితేజతో 'షాక్', రజినీ కాంత్ చంద్రముఖి 'చంద్రముఖి', మెగాస్టార్ చిరంజీవి 'ఠాగూర్'లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె కొన్ని మంచి సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్(Jai Bheem) లాంటి సినిమాలు ఈ లిస్టులో ఉన్నాయి.

పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది జ్యోతిక. నలభై ఎళ్ల వయసులోనూ యవ్వనంగా, అందంగా కనిపిస్తోంది. ఇందుకోసం భారీగా కసరత్తులు చేస్తోంది. ఇటీవల ఆమె తీవ్రమైన కసరత్తులు చేస్తున్న ఓ వీడియోను పంచుకుంది. అందులో తలకిందులుగా మెట్లు దిగడం, తలకిందులుగా నిలబడి బంతి ఆడటం వంటి ఎన్నో పనులు చేసింది. ఇప్పటికీ ఫిట్ నెస్ మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతోంది జ్యోతిక.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్