Jayasudha Marriage : మూడో పెళ్లిపై జయసుధ క్లారిటీ.. ఆ ఫారినర్ ఎవరంటే?
Jayasudha Marriage : జయసుధ.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో చిత్రాలతో ప్రజలకు దగ్గరయ్యారు. అయితే కొంతకాలంగా ఆమె మూడో పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. దీనిపై జయసుధ క్లారిటీ ఇచ్చారు.
టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ(Jayasudha) 64 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ అమెరికన్ తో పెళ్లి జరిగిందని పుకార్లు లేచాయి. దీనిపై జయసుధ స్పందించారు. తనతోపాటుగా కనిపించిన అమెరికన్ ఎవరో చెప్పారు. దీంతో ఆమె మూడో పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్టైంది. ఇలా వార్తలు రావడానికి కూడా ఓ కారణం ఉంది. ఆ వ్యక్తి ఆమెతో తరచూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
ట్రెండింగ్ వార్తలు
కొన్ని రోజులుగా సీనియర్ నటి జయసుధ పక్కన ఓ ఫారినర్ కనిపిస్తున్నాడు. ఆమె కార్యక్రమాలకు హాజరవుతున్నాడు. దీంతో అంతా.. జయసుధ మూడో పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. 64 ఏళ్ల వయసులో జయసుధ(Jayasudha) పెళ్లి చేసుకుంటున్నారని పుకార్లు లేచాయి. అయితే దీనిపై జయసుధ క్లారిటీ ఇచ్చారు.
'నాతోపాటుగా కొన్ని రోజుల నుంచి ప్రయాణిస్తున్న వ్యక్తి పేరు ఫిలిప్ రూల్స్. అతడు అమెరికన్(American). నా బయోపిక్(Biopic) చేయడానికి భారతదేశానికి వచ్చాడు. సినీరంగంలో నా ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలని ప్రతి కార్యక్రమానికి నాతో వస్తున్నాడు.' అని అసలు విషయం చెప్పింది జయసుధ.
'ఇంటర్‌నెట్‌లో ఫిలిప్ నా గురించి తెలుసుకున్నారు. నిజ జీవితంలో నేను ఎలా ఉంటాను అని నాకు తెలుసు. నా సినిమాలు, షూటింగ్‌ల వివరాలను తెలుసుకునేందుకు నాతో ఉన్నారు. అది వదిలేస్తే వేరే ఏమీ లేదు.' అని జయసుధ క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్(NTR), ఎఎన్‌ఆర్ లాంటి హీరోలతోపాటుగా.. తర్వాతి తరం హీరోలతోనూ జయసుధ నటించారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. తల్లి, వదిన, అమ్మమ్మ, నానమ్మలాంటి పాత్రల్లోనూ కనిపిస్తుంటారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా.. ఈజీగా చేసేస్తారు. కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని మెుదట వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత మనస్పర్థలతో విడిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. నితిన్ కపూర్ 2017లో చనిపోయారు.
తాజాగా దళపతి విజయ్ నటించిన వారసుడు(Varasudu) సినిమాలో తల్లి పాత్రలో నటించారు జయసుధ. కొన్ని రోజులుగా ఆమె వ్యక్తిగత జీవితంపై వార్తలు వస్తున్నాయి. అమెరికన్ తనతో ఎందుకు ఉన్నాడో చెప్పి.. క్లారిటీ ఇచ్చేశారు.