నటి ఇలియానా(Ileana) తల్లి అయింది. ఆగస్టు 1న మగబిడ్డకు జన్మనిచ్చింది. చాలా రోజులుగా బేబీ బంప్(Baby Bump) ఫొటోలను షేర్ చేస్తూ వస్తోందీ బ్యూటీ. తన ఆనందాన్ని వ్యక్తం పంచుకుంటోంది. తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చిన్నట్టుగా ప్రకటించింది. దీంతో ఆమె అభిమానులు సోషల్ మీడియా(Social Media)లో శుభాకాంక్షలు చెబుతున్నారు. బాబుకు.. కోవా ఫీనిక్స్ డోలన్ అనే పేరు కూడా పెట్టేసింది.
'ఈ ప్రపంచంలోకి మా ప్రియమైన అబ్బాయికి స్వాగతం. ఎంత సంతోషంగా ఉన్నామో మాటల్లో చెప్పలేం.' అని తెలిపింది ఇలియానా. ఈ పోస్టు చూసిన నెటిజన్లు, ప్రముఖులు విష్ చేస్తున్నారు. చాలా రోజులు కిందటే.. తాను గర్భంతో ఉన్నట్టుగా ప్రకటించింది. అయితే భర్త పేరు మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది ఇలియానా. తల్లికాబోతున్నట్టుగా ఏప్రిల్ లో ప్రకటించింది.
ఆ సమయం నుంచి బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తూ.. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంది. జులైలో డైట్ నైట్ క్యాప్షన్ పేరుతో ప్రియుడి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతడి పేరును మాత్రం చెప్పలేదు. ఇప్పుడు కుమారుడి పేరును ప్రకటించడంతో చాలా మంది ప్రశ్నిస్తున్నారు. భర్త పేరు ఏంటని అడుగుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ పోతినేని దేవదాసు(Devadasu) సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చింది ఇలియానా. పోకిరి, ఖతర్నాక్, మున్నా, జులాయి లాంటి చాలా సినిమాలు చేసింది. పెద్ద హీరోలతో నటించింది. తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించింది. తెలుగులో చివరగా 2018లో రవితేజ(Ravi Teja) సరసన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో కనిపించింది. చాలా రోజులుగా తెలుగు పరిశ్రమకు దూరంగా ఉంటుంది. బాలీవుడ్(Bollywood)లో 2021లో అభిషేక్ బచ్చన్ నటించిన బిగ్ బుల్ లో మెరిసింది.