Anshu: సందీప్ కిషన్ ఫన్నీ అండ్ కూల్.. కానీ, ప్రభాస్ అలాంటి వ్యక్తి.. మన్మథుడు హీరోయిన్ అన్షు కామెంట్స్-actress anshu comments on prabhas and sundeep kishan ritu varma director trinadha rao nakkina in mazaka movie press meet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anshu: సందీప్ కిషన్ ఫన్నీ అండ్ కూల్.. కానీ, ప్రభాస్ అలాంటి వ్యక్తి.. మన్మథుడు హీరోయిన్ అన్షు కామెంట్స్

Anshu: సందీప్ కిషన్ ఫన్నీ అండ్ కూల్.. కానీ, ప్రభాస్ అలాంటి వ్యక్తి.. మన్మథుడు హీరోయిన్ అన్షు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Published Feb 09, 2025 11:12 AM IST

Heroine Anshu About Prabhas Sundeep Kishan In Mazaka Press Meet: మన్మథుడు సినిమా హీరోయిన్ అన్షు దాదాపుగా 23 ఏళ్ల తర్వాత మజాకా మూవీతో రీ ఎంట్రీ ఇస్తోంది. మజాకా మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్‌లో హీరో సందీప్ కిషన్, ప్రభాస్‌, డైరెక్టర్ త్రినాధ రావు, రీతు వర్మపై అన్షు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

సందీప్ కిషన్ ఫన్నీ అండ్ కూల్.. కానీ, ప్రభాస్ అలాంటి వ్యక్తి.. మన్మథుడు హీరోయిన్ అన్షు కామెంట్స్
సందీప్ కిషన్ ఫన్నీ అండ్ కూల్.. కానీ, ప్రభాస్ అలాంటి వ్యక్తి.. మన్మథుడు హీరోయిన్ అన్షు కామెంట్స్

Heroine Anshu About Prabhas And Sundeep Kishan In Mazaka: మన్మథుడు సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అన్షు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అన్షుకు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ రాఘవేంద్ర మూవీలో హీరోయిన్‌గా నటించింది. అనంతరం మళ్లీ ఇప్పుడు దాదాపుగా 23 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో మజాకా మూవీతో ఎంట్రీ ఇస్తోంది అన్షు.

సందీప్ కిషన్, రీతు వర్మ హీరో హీరోయిన్స్‌గా నటించిన మజాకా మూవీలో అన్షు కీలక పాత్ర చేస్తోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న అన్షు విలేకరుల సమావేశంలో సందీప్ కిషన్, ప్రభాస్ గురించి అడగ్గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

మీ రీఎంట్రీ కోసం ఈ కథని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం?

-మజాకా లవ్లీ స్టొరీ. నాకు చాలా నచ్చింది. ప్రసన్న గారు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నవ్వుతూనే ఉన్నాను. నా క్యారెక్టర్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. చాలా హెవీ రోల్. 23 ఏళ్ల తర్వాత నేను మళ్లీ తెరపై కనిపిస్తున్న ఈ సినిమా అందరిని అలరిస్తుందని, నా పెర్ఫార్మెన్స్ ని అందరూ ఇష్టపడతారనే నమ్మకం వుంది.

23 ఏళ్ల తర్వాత మళ్లీ సెట్స్‌లోకి రావడం ఎలా అనిపించింది ?

-చాలా నెర్వస్ ఫీలయ్యాను. న్యూ కమ్మర్ లానే అనిపించింది. అయితే టీంలో అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. రెండు రోజులు తర్వాత అంతా కుదురుకుంది.

ఛాలెంజ్‌గా అనిపించిన ఎలిమెంట్ ఏంటీ?

-తెలుగు లాంగ్వేజ్. తెలుగు పాఠాలు నేర్చుకున్నాను. తెలుగు టీచర్ సురేఖ గారు చాలా ఓపికగా తెలుగు నేర్పించారు. చాలా హోం వర్క్ చేశాను. నేను బ్రిటిష్ ఇండియన్‌ని. ఇప్పటికీ లండన్‌లోనే ఉంటున్నాను. తెలుగు మాట్లాడటానికి నా వంతు ప్రయత్నం చేశాను. అది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.

సందీప్ కిషన్, రీతు వర్మతో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా ?

-ఉన్నాయి. సందీప్ వెరీ ఫన్నీ అండ్ కూల్. వెరీ నైస్ పర్సన్. రీతు వెరీ స్వీట్ అండ్ గ్రేస్ పుల్. మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. మేము కొన్ని బుక్స్ షేర్ చేసుకున్నాం.

రాఘవేంద్రలో ప్రభాస్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

- ప్రభాస్ గారు చాలా కైండ్ పర్సన్. వెరీ స్వీట్. అమెజింగ్ పెర్ఫార్మర్. తను హంబుల్ స్టార్.

మజాకాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

-నా క్యారెక్టర్ పేరు యశోద. తను హెడ్ స్ట్రాంగ్ స్టబ్ బార్న్ విమెన్. తనకి ఎమోషనల్ పెయిన్ ఉంటుంది. అది ఆ పాత్రలో కనిపిస్తుంది. యశోద పాత్రలో లీనం కావడానికి నా వంతు ప్రయత్నం చేశాను.

డైరెక్టర్ త్రినాథ రావ్ నక్కిన గారితో వర్క్ చేయడం గురించి?

-త్రినాథ రావ్ గారు లవ్లీ డైరెక్టర్. తనకి ఓర్పు చాలా ఎక్కువ. తనతో వర్క్ చేసినప్పుడు సినిమాకి లాంగ్వేజ్ బారియర్ కాదనిపించింది. తను స్వీట్ పర్సన్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం