Alia Bhatt Telugu : హాలీవుడ్ నటికి తెలుగు నేర్పిన అలియా భట్.. వీడియో వైరల్-actress alia bhatt teaches telugu to heart of stone actress gal gadot ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Actress Alia Bhatt Teaches Telugu To Heart Of Stone Actress Gal Gadot

Alia Bhatt Telugu : హాలీవుడ్ నటికి తెలుగు నేర్పిన అలియా భట్.. వీడియో వైరల్

Anand Sai HT Telugu
Aug 08, 2023 11:37 AM IST

Alia Bhatt : ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి అలియా భట్. షూటింగ్ సమయంలో కూడా తెలుగు మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఆమెకు తెలుగు భాషపై ప్రత్యేక అభిమానం ఉంది.

అలియా భట్
అలియా భట్ (instagram)

నటి అలియా భట్ (Alia Bhatt) బాలీవుడ్‌లో ఫేమస్ నటి. ఇటీవలే ఆమె నటించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రం విడుదలై ఓ మోస్తరు హిట్‌గా నిలిచింది. అలియా భట్ నటించిన హార్ట్ ఆఫ్ స్టోన్(heart of stone) ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా అలియా హాలీవుడ్‌(Hollywood)లోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అలియా.. నటి గాల్ గాడోట్‌(gal gadot)కి తెలుగు ఎలా మాట్లాడాలో నేర్పింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

అలియా భట్ చాలా సంవత్సరాలు బాలీవుడ్‌(Bollywood)కే పరిమితమైంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా(RRR Cinema)లో నటించి సౌత్‌ ఇండియాతో అనుబంధాన్ని పెంచుకుంది. తెలుగు మాట్లాడటం కూడా నేర్చుకునే ప్రయత్నం చేసింది. ఆమెకు తెలుగు భాషపై ప్రత్యేక అభిమానం ఉంది.

గాల్ గాడోట్, అలియా ఒక ఇంటర్వ్యూలో కలిసి మాట్లాడారు. ఆమె గాల్‌కి అందరికీ నమస్కారం అంటూ తెలుగు నేర్పించే ప్రయత్నం చేసింది. మీ అందరికీ నా ముద్దులు అని చెప్పింది. గాల్ కష్టపడి ఈ లైన్లు చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. తెలుగు ప్రజలు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. రాజమౌళి-మహేష్ బాబు సినిమా(Rajamouli Mahesh Babu Cinema)లో హీరోయిన్ గా నటించాలని అందరూ అడుగుతున్నారు.

గాల్ గాడోట్ హార్ట్ ఆఫ్ స్టోన్ లో నటించింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాతో గాల్ కలర్ ఫుల్ లైఫ్ మెుదలైంది. తర్వాత చాలా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. 'హార్ట్ ఆఫ్ స్టోన్' చిత్రం నెట్‌ఫ్లిక్స్ OTT ద్వారా ఆగస్టు 11న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇటలీ, లండన్‌ వంటి దేశాల్లో ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. ఈ సినిమా తెలుగులోనూ నేరుగా ఓటీటీలో విడుదలవుతుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.