Sobhita Dhulipala Wedding Pics: నాగచైతన్యతో పెళ్లి ఫొటోల్ని షేర్ చేసిన శోభిత ధూళిపాళ్ల
Sobhita Dhulipala and Naga Chaitanya Wedding Pics: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నాలుగు రోజుల క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పరిమిత సంఖ్యలో అతిథులు, బంధువుల సమక్షంలో ఒక్కటైన ఈ జంట.. పెళ్లి ఫొటోల్ని శోభిత షేర్ చేశారు.
నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట పెళ్లి చేసుకోగా.. శోభిత ధూళిపాళ్ల ఆ పెళ్లి వేడుకకి సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పెళ్లి తర్వాత ఈ జంట శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కినేని నాగార్జున దగ్గరుండి మరీ ఈ నూతన వధూవరులతో పూజలు చేయించారు. రెండేళ్లు డేటింగ్‌లో ఉన్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.
నిశ్చితార్థం తర్వాత శోభిత ధూళిపాళ్ల ఎప్పటికప్పుడు పెళ్లి ఏర్పాట్లపై సోషల్ మీడియాలో ఫొటోలతో సహా అప్‌డేట్స్ ఇస్తూ వచ్చారు. తాజాగా పెళ్లి ఫొటోలను కూడా ఆమె షేర్ చేశారు. కానీ.. నాగచైతన్య మాత్రం సోషల్ మీడియాలో అంత యాక్టీవ్‌గా షేర్ చేయడం లేదు.
హీరోయిన్ సమంత, నాగచైతన్య 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ.. నాలుగేళ్లకే మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సమంత ఒంటరిగా ఉంటోంది. ఇటీవల దగ్గుబాటి రానాతో టాక్ షోలో నాగచైతన్య మాట్లాడుతూ.. తనకి ఇద్దరు పిల్లలు కావాలని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నాగచైతన్య నటించిన తండేల్ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలకానుంది.