Vinayakan Flashing: జైలర్ మూవీ విలన్ ఓవరాక్షన్.. అన్నీ విప్పి చూపించేస్తూ.. వీడియో వైరల్ కావడంతో క్షమాపణ
Vinayakan Flashing: జైలర్ మూవీ విలన్ ఓవరాక్షన్ చేశాడు. తరచూ వివాదాల్లో చిక్కుకునే ఈ నటుడు.. తాజాగా తన పొరుగువారితో పోట్లాడుతూ అన్నీ విప్పి చూపించేస్తున్న వీడియో వైరల్ కావడంతో క్షమాపణ చెప్పాడు.
Vinayakan Flashing: రజనీకాంత్ నటించిన జైలర్, ఈ మధ్యే వచ్చిన మోస్ట్ వయోలెంట్ మలయాళం మూవీ మార్కోల్లో నటించిన వినాయకన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. తమిళ, మలయాళ సినిమాల్లో నటించడం ద్వారా పేరు సంపాదించిన ఈ నటుడు.. తన పొరుగింటి వ్యక్తితో గొడవకు దిగాడు. ఆ సమయంలో లుంగీ కట్టుకొని కనిపించిన అతడు.. అది కూడా విప్పేసి ఆ వ్యక్తి వైపు అసభ్యకరంగా చూపిస్తున్న ఫొటోలు, వీడియో వైరల్ అయ్యాయి.

వినాయకన్ ఫ్లాషింగ్ వీడియో
తన ఇంటి బాల్కనీలో ఉన్న వినాయకన్.. పొరుగింటి వ్యక్తితో ఫైట్ చేయడం ఆ వీడియోలో కనిపించింది. జారిపోతున్న తన లుంగీని సరి చేసుకుంటూ, ఆ వ్యక్తిని తిడుతూ అటు ఇటూ తిరగడం ఆ వీడియోలో చూడొచ్చు. కాసేపటికి కింద పడుకొని మళ్లీ లేచి నానా హంగామా చేశాడు. మరికొన్ని ఫొటోల్లో అతడు తన లుంగీ కూడా విప్పేసి అవతలి వ్యక్తి వైపు అసభ్యకరంగా చూపిస్తుండటం కూడా కనిపించింది.
ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతడు బాగా తాగి ఉన్నట్లు కనిపిస్తోందని కొందరు కామెంట్స్ చేశారు. అతన్ని వెంటనే మలయాళం సినిమా నుంచి సస్పెండ్ చేయాలని మరికొందరు డిమాండ్ చేశారు. మొత్తం నటన నుంచే నిషేధించాలని కూడా కొందరు కామెంట్ చేయడం గమనార్హం.
వినాయకన్ క్షమాపణ
ఈ వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారి, తనపై విమర్శలు వెల్లువెత్తడంతో వినాయకన్ తన ఫేస్‌బుక్ పోస్టులో క్షమాపణ చెప్పాడు. మలయాళంలో ఆ పోస్ట్ ఉంది. "ఓ నటుడిగా, ఓ వ్యక్తిగా చాలా అంశాలను నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను.
దీనివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమాపణ కోరుతున్నాను. దీనిపై చర్చలు కొనసాగాలి" అని వినాయకన్ మలయాళంలో రాసినట్లు మాతృభూమి వెల్లడించింది.
వినాయకన్ వివాదాలు
నటుడు వినాయకన్ కు వివాదాలు కొత్త కాదు. 2023లో కేరళలోని ఎర్నాకులం పోలీస్ స్టేషన్ లో రభస సృష్టించినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత బెయిలుపై విడుదల చేశారు.
గతేడాది హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ సిబ్బందితో గొడవకు దిగడంతో అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఓ టీ స్టాల్ యజమానితో అతడు గొడవకు దిగిన వీడియో కూడా వైరల్ అయింది. వినాయకన్ తన తర్వాతి మూవీలో విక్రమ్ తో కలిసి ధృవనక్షత్రం మూవీలో నటిస్తున్నాడు.
సంబంధిత కథనం