Srikanth on Rave Party: మొన్న నా భార్యతో విడాకులు ఇప్పించేశారు.. ఇప్పుడిలా.. వాడెవడో నాలాగే ఉన్నాడు కానీ..: శ్రీకాంత్-actor srikanth says he does not go to rave parties urges not to believe in these rumours ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Srikanth On Rave Party: మొన్న నా భార్యతో విడాకులు ఇప్పించేశారు.. ఇప్పుడిలా.. వాడెవడో నాలాగే ఉన్నాడు కానీ..: శ్రీకాంత్

Srikanth on Rave Party: మొన్న నా భార్యతో విడాకులు ఇప్పించేశారు.. ఇప్పుడిలా.. వాడెవడో నాలాగే ఉన్నాడు కానీ..: శ్రీకాంత్

Hari Prasad S HT Telugu
May 20, 2024 05:37 PM IST

Srikanth on Rave Party: తాను బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిపోయానంటూ వస్తున్న వార్తలను ఖండించాడు సినీ నటుడు శ్రీకాంత్. తాను రేవ్ పార్టీలకు వెళ్లే వ్యక్తిని కాదని అతడు స్పష్టం చేశాడు.

వాడెవడో నాలాగే ఉన్నాడు.. అది నేను కాదు.. రేవ్ పార్టీలకు వెళ్లను: శ్రీకాంత్
వాడెవడో నాలాగే ఉన్నాడు.. అది నేను కాదు.. రేవ్ పార్టీలకు వెళ్లను: శ్రీకాంత్

Srikanth on Rave Party: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తాను కూడా ఉన్నట్లు వస్తున్న వార్తలపై సినీ నటుడు శ్రీకాంత్ స్పందించాడు. ఆ వీడియో చూసి తాను కూడా షాక్ తిన్నానని, వాడెవడో తనలాగే ఉన్నాడని అతడు అనడం విశేషం. రేవ్ పార్టీలకు వెళ్లే కల్చర్ తనది కాదని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని ఎవరూ నమ్మొద్దంటూ ప్రత్యేకంగా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

రేవ్ పార్టీపై శ్రీకాంత్ వివరణ ఇదీ

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తాను దొరికిపోయినట్లు వార్తలు రాగానే ఉలిక్కి పడిన నటుడు శ్రీకాంత్ వెంటనే ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు. కొన్ని ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్ లో వస్తున్న వార్తలను అతడు ఖండించాడు. ఆ వీడియోలో శ్రీకాంత్ ముందుగా తన ఇంట్లో నుంచి బయటకు వస్తూ కనిపించాడు. ఆ తర్వాత ఈ పుకార్లపై తన వివరణ ఇచ్చాడు.

"ఇది మా ఇల్లేగా.. మా ఇంట్లోనే ఉన్నాను.. హైద‌రాబాద్‌లోనే ఉన్నాను. బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లిన‌ట్లు, పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు ఫోన్ కాల్స్ వ‌చ్చాయి. వీడియో క్లిప్స్ చూశాను. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవ‌టంతో నాకు సంబంధించిన వార్త‌ల‌ను వారు రాయ‌లేదు. కొన్నింటిలో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లాన‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో స‌హా మా కుటుంబ స‌భ్యులంద‌రూ న‌వ్వుకున్నాం.

మొన్నేమో నా భార్య‌తో నాకు విడాకులు ఇప్పించేశారు. ఇప్పుడేమో రేవ్ పార్టీకెళ్లాన‌ని అన్నారు. వార్త‌లు రాసిన వాళ్లు తొంద‌ప‌డ‌టంలో త‌ప్పులేద‌నిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన‌ వాడెవడో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. అత‌డికి కాస్త గ‌డ్డం ఉంది. ముఖం క‌వ‌ర్ చేసుకున్నాడు. నేనే షాక‌య్యాను. ద‌య‌చేసి ఎవ‌రూ న‌మ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీల‌కు, ప‌బ్స్ వెళ్లే వ్య‌క్తిని కాను నేను.

ఎప్పుడైనా బ‌ర్త్ డే పార్టీల‌కు వెళ్లినా కొంత సేపు అక్క‌డి ఉండి వ‌చ్చేస్తానంతే. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియ‌దు. మీడియా మిత్రులు స‌హా ఎవ‌రూ న‌మ్మొద్దు. విష‌యం తెలుసుకోకుండా.. రేవ్ పార్టీలో ప‌ట్టుబ‌డ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు. నాలాగా ఉన్నాడ‌నే మీరు పొర‌బ‌డి ఉంటార‌ని నేను అనుకుంటున్నాను. నేను ఇంట్లోనే ఉన్నాను. ద‌య‌చేసి త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మొద్దు’’ అని శ్రీకాంత్ స్పష్టం చేశాడు.

బెంగళూరులో ఏం జరిగింది?

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారని, అందులో ఏపీకి చెందిన రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నటుడు శ్రీకాంత్ తోపాటు నటి హేమ కూడా ఈ రేవ్ పార్టీలో ఉన్నట్లు కొందరు చెప్పారు.

దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకోవడం వాటిలో చూడొచ్చు. వాటిలో ఓ బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తిని చూసి హీరో శ్రీకాంత్ కూడా దొరికిపోయాడని వార్తలు రాసేశారు. దీనిపై శ్రీకాంత్ స్పందించి వివరణ ఇచ్చాడు.

టీ20 వరల్డ్ కప్ 2024