Sonu Sood wife Accident: రోడ్డు ప్రమాదంలో సోనూసూద్ భార్య సోనాలీకి తీవ్ర గాయాలు.. అప్‍డేట్ చెప్పిన నటుడు!-actor sonu sood wife sonali sood injured in major car accident ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sonu Sood Wife Accident: రోడ్డు ప్రమాదంలో సోనూసూద్ భార్య సోనాలీకి తీవ్ర గాయాలు.. అప్‍డేట్ చెప్పిన నటుడు!

Sonu Sood wife Accident: రోడ్డు ప్రమాదంలో సోనూసూద్ భార్య సోనాలీకి తీవ్ర గాయాలు.. అప్‍డేట్ చెప్పిన నటుడు!

Sonu Sood wife Sonali Sood Accident: నటుడు సోనూసూద్ భార్య సోనాలీ సూద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

భార్య సోనాలీ సూద్‍తో సోనూసూద్

ప్రముఖ నటుడు సోనూసూద్ భార్య సోనాలీ సూద్‍ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సోనాలీ సోదరి, అల్లుడు కూడా ఈ ప్రమాదంలో గాయాల పాలైనట్టు సమాచారం. ముంబై-నాగ్‍పూర్ హైవేపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

సోనాలీ సూద్‍కు ఈ ప్రమాదంలో గాయాలు తీవ్రంగా అయినట్టు సోనూసూద్ ప్రతినిధి వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో సోనాలీ సోదరి, అల్లుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి నాగ్‍‍పూర్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిిత్స అందిస్తున్నారు వైద్యులు.

ఆసుపత్రికి సోనూసూద్

సోనాలీ సూద్ ప్రయాణిస్తున్న కారుకు సోమవారం (మార్చి 24) రాత్రి రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ట్రక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం గురించి తెలుసుకున్న సోనూసూద్ వెంటనే ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు. రాత్రి నుంచి అక్కడే ఉన్నారు. ప్రస్తుతం సోనాలీ, ఆమె సోదరి, అల్లుడికి వైద్యులు చికిత్స చేస్తున్నారు.

నిలకడగా..

తన భార్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని సోనూసూద్ చెప్పినట్టు ఇండియాటుడే రిపోర్ట్ వెల్లడించింది. “ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉన్నారు. జై శ్రీరామ్” అని సోనూ చెప్పినట్టు ఆ రిపోర్ట్ పేర్కొంది.

సోనాలీ సూద్ కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు కోరుకుంటూ పోస్టులు చేస్తున్నారు. సినిమాలతో పాటు సేవాకార్యక్రమాలతోనూ సోనూసూద్‍కు చాలా మంది అభిమానులు ఉన్నారు. కరోనా సమయంలో చాలా మంది సాయం చేశారు సోనూ. ఆ తర్వాత కూడా సేవాకార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు.

సోనూసూద్ హిందీ, తెలుగు, తమిళంలో చాలా చిత్రాల్లో నటించారు. 25 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. హ్యాండ్సప్ చిత్రంతో టాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇచ్చిన సోనూ.. అశోక్, అరుంధతి చిత్రాలతో తెలుగులోనూ బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో నెగెటివ్ పాత్రల్లో నటించారు. ఓ దశలో హిందీకి మించి తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో నటించారు.

హిందీ మూవీ ‘ఫతే’తో ఈ ఏడాది దర్శకుడిగానూ మారారు సోనూసూద్. ఈ మూవీకి డైరక్షన్ చేయడంతో పాటు ప్రధాన పాత్ర పోషించారు. ఫతే సినిమా ఈ ఏడాది జనవరి 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ఇటీవలే జియో హాట్‍స్టార్ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం