ఆ కూర్చోవడం ఏంటీ, మూసుకుని ఉండమని ఇంటికి పంపించారు.. బిగ్ బాస్ ఎలిమినేట్ కంటెస్టెంట్ ప్రియాతో హీరో శివాజీ కామెంట్స్-actor sivaji questions to bigg boss 9 telugu this week eliminated contestant priya shetty in bigg boss buzz interview ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఆ కూర్చోవడం ఏంటీ, మూసుకుని ఉండమని ఇంటికి పంపించారు.. బిగ్ బాస్ ఎలిమినేట్ కంటెస్టెంట్ ప్రియాతో హీరో శివాజీ కామెంట్స్

ఆ కూర్చోవడం ఏంటీ, మూసుకుని ఉండమని ఇంటికి పంపించారు.. బిగ్ బాస్ ఎలిమినేట్ కంటెస్టెంట్ ప్రియాతో హీరో శివాజీ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ అయింది. హౌజ్‌లో చేసిన అతి కారణంగా ప్రియాను ఎలిమినేట్ చేశారు ఆడియెన్స్. అయితే, బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ప్రియా శెట్టికి చెమటలు పట్టించాడు హీరో, హోస్ట్ శివాజీ. హౌజ్‌లో ప్రియాశెట్టి ఉన్న విధానంపై హోస్ట్ శివాజీ అడిగిన ప్రశ్నలకు ఆమె బిత్తరపోయింది.

ఆ కూర్చోవడం ఏంటీ, మూసుకుని ఉండమని ఇంటికి పంపించారు.. బిగ్ బాస్ ఎలిమినేట్ కంటెస్టెంట్ ప్రియాతో హీరో శివాజీ కామెంట్స్

బిగ్ బాస్ తెలుగు 9 మూడో వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో హౌజ్‌లో ఆడిన తీరు, ఉన్న విధానంపై ప్రశ్నలు అడుగుతుంటారని తెలిసిందే. ఈ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ బజ్ ఇంటర్వ్యూకు హోస్ట్‌గా హీరో, మాజీ సీజన్ కంటెస్టెంట్ శివాజీ ఉన్నాడు.

బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ

హౌజ్‌లోనే సూటిగా మాట్లాడిన శివాజీ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఎలిమినేట్ కంటెస్టెంట్స్ ఆటతీరుపై గట్టిగానే అడుగుతున్నాడు. తాజాగా బిగ్ బాస్ తెలుగు 9 మూడో వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ప్రియా శెట్టి బజ్ ఇంటర్వ్యూకి వచ్చింది. ఆమె హౌజ్‌లో ఉన్న తీరును శివాజీ ఎండగట్టడంతో ప్రియకు చెమటలు పట్టాయి.

ప్రియా రాగానే ముందుకు చాపి కాలు మీద కాలు వేసుకుని శివాజీ కూర్చున్నాడు. "ఇలా కూర్చుంటే ఎలా ఉంది. బాలేదుగా. ఓసారి ఫొటో వేయండమ్మా" అని శివాజీ అన్నాడు. దాంతో వీకెండ్స్‌లో హోస్ట్ నాగార్జున వచ్చినప్పుడు ప్రియా, కల్యాణ్, హరీష్ కూర్చున్న ఫొటో చూపించారు. అది చూసిన ప్రియా షాక్ అయిపోయింది.

నాగార్జున గారు కావచ్చు కాకపోవచ్చు

"అక్కడ అందరు ఎలా కూర్చున్నారు. మీ ముగ్గురు ఎలా కూర్చున్నారు. అది ఎవరి ముందు కూర్చున్నారు. నాగార్జున గారు కావచ్చు కాకపోవచ్చు. హోస్ట్ ముందు కూర్చున్నారు. మీరు మాట్లాడితే కామనర్స్, సెలబ్రిటీలు. అగ్ని పరీక్షకు ఎన్ని రోజులు ఉన్నారు, హౌజ్‌లో ఎన్ని రోజులు ఉన్నారు" అని వరుసగా ప్రశ్నించాడు శివాజీ.

"అంతా కలిపి 2 నెలలు కావచ్చు" అని ప్రియా శెట్టి సమాధానం ఇచ్చింది. "మీరు సెలబ్రిటీ కాదా. కాలేదు అని మీరు అనుకుని ఇలా బిహేవ్ చేశారంటే కొంపదీసి రేపు పొద్దున పెద్ద సెలబ్రిటీ అయిపోతే ఎలా చేస్తారు. ఎందుకొచ్చారు షోకి అసలు మీరు" అని శివాజీ మళ్లీ ఏసుకున్నాడు. "గెలవలాని ఆడాను అని మెల్లిగా చెప్పింది ప్రియా.

అక్కడ ఎందుకు వినలేదు

"అసలు ఏం చేశారు విన్ అవడానికి. ప్రియాకు కేవలం కంప్లైట్స్ చేయడం మాత్రమే వచ్చు ఆట ఆడటం రాదు. ఇక్కడ బాగా వింటున్నారు. అక్కడ ఎందుకు అంత" అని శివాజీ అన్నాడు. "అక్కడ ఎవరు ఇలా చెప్పలేదు" అని ప్రియా అంటే.. "మీరు ఎవరిని చెప్పనిచ్చారు మీరు. అగ్ని పరీక్షలో ఉన్న కాన్ఫిడెన్స్ ఇక్కడికి వచ్చాక ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది" అని శివాజీ అన్నాడు.

"తొక్కేస్తున్నారన్న ఫీలింగ్ వచ్చింది" అని ప్రియా అంటే.. "నువ్వు తొక్కేసావ్ నీ వాయిస్‌తోటి. ఇదేంటీ" అని నోరు మూసుకో అనేది చేతులతో చూపించాడు శివాజీ. "నోరు మూసుకుని ఉండు" అని ప్రియా చెప్పింది.

మూసుకుని ఉండమని

"ఆడియెన్స్ ఫీలింగ్ కూడా అదే.. ఇక ఈ అమ్మాయిని మనం మూసుకుని ఉండమని ఇంటికి పంపించేద్దాం" అన్న అర్థంలో శివాజీ చేతులతో నోరు మూసుకో అనే సైగ చేశాడు. ఇలా తన ప్రశ్నలతో ప్రియా శెట్టికి చెమటలు పట్టించాడు హీరో శివాజీ. దీనికి సంబంధించిన బిగ్ బాస్ బజ్ ప్రోమోను ప్రియా ఎలిమినేట్ అనంతరం విడుదల చేశారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం