Bigg Boss Sivaji: యానిమల్‌లో బాబీ డియోల్ కంటే బాగా చేశారని రివ్యూ రాశారు.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్-actor sivaji comments on mangapathi character in court state vs a nobody says review better than bobby deol in animal ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Sivaji: యానిమల్‌లో బాబీ డియోల్ కంటే బాగా చేశారని రివ్యూ రాశారు.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్

Bigg Boss Sivaji: యానిమల్‌లో బాబీ డియోల్ కంటే బాగా చేశారని రివ్యూ రాశారు.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Bigg Boss Sivaji About Mangapathi Character In Court: బిగ్ బాస్ ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన హీరో, నటుడు శివాజీ లేటెస్ట్‌గా నటించిన సినిమా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. మార్చి 14న విడుదలైన కోర్ట్ మూవీకి ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను శివాజీ పంచుకున్నాడు.

యానిమల్‌లో బాబీ డియోల్ కంటే బాగా చేశారని రివ్యూ రాశారు.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్

Bigg Boss Sivaji About Mangapathi Character: హీరోగా ఎన్నో సినిమాల్లో అలరించిన శివాజీ నటుడిగాను మెప్పించారు. చాలా గ్యాప్ తర్వాత బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌లో తనదైన పంతాలో ఆకట్టుకున్నారు. బిగ్ బాస్, 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్‌లతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు.

విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్

చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించారు శివాజీ. బిగ్ బాస్ శివాజీ నటించిన లేటెస్ట్ మూవీనే కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన కోర్ట్ మూవీని హీరో నాని సమర్పించాడు. మార్చి 14న థియేటర్లలో విడుదలైన కోర్ట్ సినిమాకు విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రీమియర్స్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మంగపతి క్యారెక్టర్ గురించి

అలాగే, శివాజీ చేసిన మంగపతి క్యారెక్టర్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న శివాజీ కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ మూవీ గురించి, అందులోని మంగపతి క్యారెక్టర్ ఇతర సినీ విశేషాలను పంచుకున్నాడు.

శివాజీ గారు సినిమాకి, మీరు చేసిన మంగపతి క్యారెక్టర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముందుగా కంగ్రాట్స్.

-థాంక్ యూ అండి

దాదాపు 12 ఏళ్ల తర్వాత మంగపతి లాంటి పవర్‌ఫుల్ పాత్రతో రావడం ఎలా అనిపించింది?

-నా ఫ్యామిలీ, పిల్లలు నన్ను మళ్లీ యాక్ట్ చేయమని కోరేవారు. నాకూ చేయాలని ఉండేది. కానీ, నేను ఎవరినీ అడగలేను. ఈటీవీ బాపినీడు గారిని కలిసి విషయం చెప్పాను. ముందుగా ప్రొడక్షన్ చేద్దామని అనుకున్నాం. అయితే ఆయన యాక్ట్ చేయమని చెప్పారు. అలా 90s వెబ్ సిరిస్ ఓకే చేశాను. అది చేస్తున్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. నేను ఏంటో తెలియజేసే వేదిక అది.

-నేచర్ ఈ అవకాశం పంపించిందనుకుని వెళ్లాను. ఆ షోతో అసలు శివాజీ ఏమిటో ప్రపంచానికి తెలిసింది. అదే సమయంలో వెబ్ సిరిస్ కూడా పెద్ద హిట్ అయ్యింది. దాని తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. దాదాపు ఎనభై కథలు విన్నాను. చాలా వరకూ ఫాదర్ రోల్స్ ఉన్నాయి. అందులో చాలా వరకూ రిజెక్ట్ చేశాను. కోర్ట్‌లో చేసిన మంగపతి క్యారెక్టర్ నా 25 ఏళ్ల కల. నాని గారి ద్వారా ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది.

రీఎంట్రీలో 90sలో పాజిటివ్, కోర్ట్‌లో మంగపతి నెగిటివ్ క్యారెక్టర్ చేశారు కదా. ఇందులో మీకు నచ్చిన పాత్ర?

-మంగపతి. ఈ పాత్రలో సహజమైన ఎమోషన్ ఉంది. ప్రతి కుటుంబంలో అలాంటి ప్రొటెక్టివ్ నేచర్ ఉన్న పర్సన్ ఉంటారు. అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అలానే బిహేవ్ చేస్తాడు. మంగపతి క్యారెక్టర్‌కి వచ్చిన రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇచ్చింది. యానిమల్‌లో బాబీ డియోల్ కంటే బాగా చేశాడని ఒకరు రివ్యూ రాశారు. ఆ మాట విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది.

-ఈ సందర్భంగా నా పిల్లలకు, భార్యకు థాంక్స్ చెబుతున్నాను. వాళ్లు అడిగితే మళ్లీ చేశాను. అలాగే ఈటీవీ బాపినీడు గారికి, డైరెక్టర్ జగదీష్‌కి, ప్రొడ్యూసర్ నాని గారికి ధన్యవాదాలు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం