90s Biopic Season 2 OTT: ఓటీటీలో 90స్‌ సీజన్ 2, రాత్రి టీవీ ముందు కూర్చుంటే మీరు కనిపించేవారన్నారు: శివాజీ కామెంట్స్-actor sivaji comments on court movie director ram jagadeesh nani and ott telugu series 90s a middle class biopic 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  90s Biopic Season 2 Ott: ఓటీటీలో 90స్‌ సీజన్ 2, రాత్రి టీవీ ముందు కూర్చుంటే మీరు కనిపించేవారన్నారు: శివాజీ కామెంట్స్

90s Biopic Season 2 OTT: ఓటీటీలో 90స్‌ సీజన్ 2, రాత్రి టీవీ ముందు కూర్చుంటే మీరు కనిపించేవారన్నారు: శివాజీ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Actor Sivaji On OTT Web Series 90s A Middle Class Biopic 2: ఓటీటీ సూపర్ హిట్ తెలుగు కామెడీ వెబ్ సిరీస్ 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‌కు సీక్వెల్‌పై నటుడు శివాజీ క్లారిటీ ఇచ్చాడు. అలాగే, కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ మూవీ, డైరెక్టర్ రామ్ జగదీష్‌పై బిగ్ బాస్ శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఓటీటీలో 90స్‌ సీజన్ 2, రాత్రి టీవీ ముందు కూర్చుంటే మీరు కనిపించేవారన్నారు: శివాజీ కామెంట్స్

Sivaji On OTT Web Series 90s A Middle Class Biopic 2: ఓటీటీలో సూపర్ హిట్ సాధించిన తెలుగు కామెడీ వెబ్ సిరీస్ 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఈటీవీ విన్‌లో ఓటీటీ రిలీజ్ అయిన ఈ సిరీస్ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగానో అలరించింది. దీంతో 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సీజన్ 2పై అంచనాలు పెరిగాయి.

అయితే, తాజాగా ఈ 90స్ బయోపిక్ సిరీస్‌లో మెయిన్ లీడ్ రోల్ చేసిన నటుడు, హీరో శివాజీ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చాడు. లేటెస్ట్‌గా శివాజీ నటించిన కోర్ట్ రూమ్ డ్రామా మూవీ కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. నేచురల్ స్టార్ నాని సమర్పణలో రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన కోర్ట్ మంచి ఆదరణ పొందుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పిన శివాజీ 90స్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చాడు.

మంగపతి పాత్రని ఎంచుకున్న తర్వాత ఎలాంటి సవాళ్లు ఎదురుకున్నారు?

-ఏం చూసి ఈ క్యారెక్టర్‌కి నన్ను సెలెక్ట్ చేసుకున్నారని డైరెక్టర్ గారిని అడిగాను. పగలంతా స్క్రిప్ట్ రాసుకొని నైట్ టీవీ ముందు కూర్చుంటే మీరు కనిపించేవారు. ఆ పాత్రకి పర్ఫెక్ట్‌గా యాప్ట్ అని సెలెక్ట్ చేసుకున్న అని చెప్పాడు. నా కోసం ఇలాంటి క్యారెక్టర్ పుట్టిందని భావిస్తున్నాను.

-డైరెక్టర్ రియల్ లైఫ్ నుంచి ఈ క్యారెక్టర్ తీసుకున్నాడని భావిస్తున్నాను. నా పాత్రకి సంబధించిన ప్రతిది డైరెక్టర్ క్రెడిట్. నేను ఇది చేయగలనని ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. నా క్యారెక్టర్‌ని డైరెక్టర్ నెక్ట్స్ లెవల్‌లో రాసుకున్నాడు. ఇందులో ప్రతి పాత్రని శిల్పం చెక్కినట్లుగా చెక్కాడు.

-ఎస్వీ రంగారావు గారు, గుమ్మడి గారు, జగ్గయ్య గారు, రాజనాల గారు మరపురాని పాత్రలు చేశారు. అలాంటి పాత్రలు చేయాలని నాకు ఉండేది. హీరోగా స్టిక్ అవ్వాలనే ఆలోచన నాకూ ఎప్పుడూ లేదు. జల్సా, ఒట్టేసి చెబుతున్నా, మనసుంటే చాలు లాంటి సినిమాల్లో చేసిన పాత్రలు అలా చేసినవే.

నాని గారితో మీ బాండింగ్ గురించి?

-నాని గారు యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్నారు. నిర్మాతగా ఆయనపై చాలా గౌరవం ఉంది. కొత్త వారిని ప్రోత్సాహించడంలో గొప్ప చొరవ చూపిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్, ఉషా కిరణ్ లాంటి బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా అవుతుంది.

-కొత్తవారు చేసిన సినిమాకి తన సినిమాని పణంగా పెట్టి ఛాలెంజ్ విసరడం మామూలు విషయం కాదు. అది సినిమాపై ఆయనకి ఉన్న నమ్మకం. నాని గారి బ్యానర్‌లో ఈ సినిమా చేయడం నా అదృష్టం. దీప్తి గారు చాలా సపోర్ట్ చేశారు. తను షూటింగ్ దగ్గరే ఉండేవారు. ప్రొడక్షన్‌కి కావాల్సిన ప్రతిది సమకూర్చేవారు.

మంగపతి తరహలో మరో పాత్ర ఏదైనా విన్నారా?

-మెడికల్ షాప్ మూర్తి అనే ఓ క్యారెక్టర్ విన్నాను. త్వరలోనే వాళ్లు అనౌన్స్ చేస్తారు.

సినిమాలకి దూరమావ్వడం రిగ్రెట్‌గా ఫీలయ్యారా?

-లేదండీ. నేను ప్రజల కోసం నిలబడ్డాను. ప్రాంతం కోసం, బావితరాల కోసం పోరాటం చేశాను. ఇందులో ఎలాంటి రిగ్రెట్ లేదు. ఎప్పటికీ ప్రజల తరఫున ఉంటాను.

నెక్ట్స్ చేస్తున్న ప్రాజెక్ట్స్?

-లయ, నేను కలసి ఓ సినిమా చేస్తున్నాం. అలాగే దండోరా అనే సినిమా చేస్తున్నాను. 90s ఓటీటీ సిరీస్‌కు సీక్వెల్ ఉంటుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం