మీరు మాట కూడా జారారు- ఎలిమినేట్ అయిన మనీష్ మర్యాదతో హీరో శివాజీ- బిగ్ బాస్ బజ్‌లో ఒప్పుకున్న కామనర్-actor sivaji bigg boss buzz interview with bigg boss telugu 9 this week eliminated contestant manish maryada ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మీరు మాట కూడా జారారు- ఎలిమినేట్ అయిన మనీష్ మర్యాదతో హీరో శివాజీ- బిగ్ బాస్ బజ్‌లో ఒప్పుకున్న కామనర్

మీరు మాట కూడా జారారు- ఎలిమినేట్ అయిన మనీష్ మర్యాదతో హీరో శివాజీ- బిగ్ బాస్ బజ్‌లో ఒప్పుకున్న కామనర్

Sanjiv Kumar HT Telugu

బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మర్యాద మనీష్. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ బజ్ పేరుతో ఇంటర్వ్యూ నిర్వహిస్తుంటారు. ఈసారి బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ బజ్‌కు హోస్ట్‌గా చేస్తున్న హీరో శివాజీ ఎలిమినేట్ అయిన కామనర్ మనీష్ మర్యాదను నోరు జారారు అని చెప్పాడు.

మీరు మాట కూడా జారారు- ఎలిమినేట్ అయిన మనీష్ మర్యాదతో హీరో శివాజీ- బిగ్ బాస్ బజ్‌లో ఒప్పుకున్న కామనర్ (YouTube/Star Maa)

బిగ్ బాస్ తెలుగు 9 సందడి కొనసాగుతోంది. బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఈ వారం మనీష్ మర్యాద ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ బజ్ పేరుతో ఇంటర్వ్యూ నిర్వహిస్తారని తెలిసిందే. అలా ఈసారి బిగ్ బాస్ తెలుగు 9 బజ్‌కు హోస్ట్‌గా హీరో, సీజన్ 7 కంటెస్టెంట్ శివాజీ వ్యవహరించారు.

రెండో వారం ఎలిమినేట్

ఇక హౌజ్‌లోకి కామనర్‌గా వచ్చిన మనీష్ మర్యాద బిగ్ బాస్ 8 తెలుగు రెండో వారం ఎలిమినేట్ అయ్యాడు. అతన్ని బిగ్ బాస్ బజ్‌లో హీరో శివాజీ ఇంటర్వ్యూ చేశాడు. "ఫైరు ఎవరు ఫ్లవర్ ఎవరు" అని హౌజ్‌లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ గురించి అడిగాడు శివాజీ. డీమోన్ ఫ్లవర్ అని చెప్పిన మనీష్ "టాప్ 7 మెటీరియల్ కానీ, ఎందుకో ఒక టైమ్‌లో వెళ్లిపోతారని కొడుతుంది కొంచెం" అని చెప్పాడు.

తనూజ గౌడ గురించి

"తన వల్ల గేమ్ ఇప్పటికీ ఇంపాక్ట్ అవ్వలేదు" అని తనూజ గౌడ గురించి చెప్పాడు మనీష్. తర్వాత "ఇతను 3 విషయాలు బాగా మ్యానేజ్ చేస్తాడు. ఒకటి ఎంటర్‌టైన్‌మెంట్, సెకండ్ ఎమోషన్స్, థర్డ్ టాస్క్. ఇంకేం కావాలి సర్" అని జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ గురించి గొప్పగా చెప్పాడు మనీష్ మర్యాద.

నామినేట్ చేసేవాన్ని

"హౌజ్ నుంచి వచ్చాక ప్రియా గురించి మీ అభిప్రాయం ఏంటీ" అని శివాజీ అడిగాడు. "నేను అయితే హౌజ్‌లో ఉంటే వచ్చే వారం నామినేట్ చేసేవాన్ని" అని మనీష్ అన్నాడు. "మీ దగ్గర మాటలు చాలా ఉన్నాయని మాకు తెలుసు. కానీ, మీరు మాట కూడా జారారు" అని శివాజీ అన్నాడు.

తప్పు ఒప్పుకున్న మనీష్

"ఎందుకో మనీష్ ఓవర్ కాన్ఫిడెన్స్‌గా బిహేవ్ చేస్తున్నాడనిపించింది" అని శివాజీ అంటే.. "నేను కూడా నోటీస్ చేశాను" అని తప్పు ఒప్పుకున్నాడు మనీష్. "మీ దగ్గర యూనిటీ ఉందా. ఉంటే ఎవరెవరితో ఎవరెవరికి ఉంది. మీరు శ్రీజ, ప్రియ ఇంత చేయడం వల్ల ఆయన మిమ్మల్ని కూర్చోబెట్టారు అక్కడ" అని శివాజీ అన్నాడు.

వైల్డ్ ఫైర్ చేశాం

"యాక్చువల్‌గా నేను ఫైరుగా ఉండి వైల్డ్ ఫైర్ చేశానని నాకు ఇప్పుడే అర్థమవుతుంది" అని నవ్వాడు మర్యాద మనీష్. అంతటితో తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ 9 తెలుగు బజ్ ప్రోమో ముగిసింది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం