Mercy Killing: ప్రతి మహిళ చూడాల్సిన సినిమా మెర్సీ కిల్లింగ్.. సాయి కుమార్ కామెంట్స్-actor sai kumar comments on mercy killing movie in pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mercy Killing: ప్రతి మహిళ చూడాల్సిన సినిమా మెర్సీ కిల్లింగ్.. సాయి కుమార్ కామెంట్స్

Mercy Killing: ప్రతి మహిళ చూడాల్సిన సినిమా మెర్సీ కిల్లింగ్.. సాయి కుమార్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Mar 31, 2024 06:23 AM IST

Sai Kumar Mercy Killing Pre Release Event: ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మెర్సీ కిల్లింగ్. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. మెర్సీ కిల్లింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు సాయి కుమార్ మూవీకి సంబంధించిన విషయాలపై తెలిపారు.

ప్రతి మహిళ చూడాల్సిన సినిమా మెర్సీ కిల్లింగ్.. సాయి కుమార్ కామెంట్స్
ప్రతి మహిళ చూడాల్సిన సినిమా మెర్సీ కిల్లింగ్.. సాయి కుమార్ కామెంట్స్

Sai Kumar Mercy Killing Pre Release Event: సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలపై చిత్రీకరించిన లేటెస్ట్ మూవీ మెర్సీ కిల్లింగ్. సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన చిత్రమే మెర్సీ కిల్లింగ్. ఈ సినిమాలో నటుడు సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మెర్సీ కిల్లింగ్ చిత్రాన్ని సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీకి శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్నారు.

yearly horoscope entry point

మెర్సీ కిల్లింగ్ చిత్రానికి సూరపల్లి వెంకటరమణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు జి. అమర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఎం.ఎల్. రాజా సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను యంగ్ హీరో ఆకాష్ పూరి విడుదల చేశాడు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా చేస్తూ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. అయితే, మెర్సీ కిల్లింగ్ సినిమా ఏప్రిల్ 12న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఏప్రిల్ 12న థియేటర్లలో విడుదల కానున్న సందర్భంగా తాజాగా మెర్సీ కిల్లింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అట్టహాసంగా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో సాయి కుమార్, కోనా వెంకట్, ఆకాష్ పూరి, యాంకర్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విషయాలను నటుడు సాయి కుమార్ స్టేజ్ వేదికగా పంచుకున్నారు.

"మెర్సీ కిల్లింగ్ సినిమా స్వేచ్ఛ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. స్వేచ్ఛ పాత్రలో హారిక బాగా నటించింది. దర్శకుడు సూరపల్లి వెంకటరమణ చక్కటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. పార్వతీశం, ఐశ్వర్య పోటీ పడి నటించారు. నేను ఈ సినిమాలో మరో మంచి రోల్‌లో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ప్రతి మహిళ చూడవలసిన సినిమా మెర్సీ కిల్లింగ్" అని నటుడు సాయి కుమార్ తెలిపారు. అలాగే సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలు ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలనే విషయంతో ఈ కథ ప్రారంభం అవుతుందని, అందరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుందని.. అందరూ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కష్టపడి పనిచేశారని సినిమా బాగుందని ప్రివ్యూ చూసిన అందరూ అంటుంటే.. చాలా సంతోషంగా ఉందని దర్శకుడు వెంకటరమణ ఎస్ తెలిపారు.

కాగా మెర్సీ కిల్లింగ్ సినిమాలో సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబీ హారిక, రామరాజు, సూర్య, ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ, ల్యాబ్ శరత్, హేమ సుందర్, వీరభద్రం, ప్రమీల రాణి తదితరులు నటించారు.

ఇదిలా ఉంటే, సాయికుమార్‌ సినీ ప్రస్థానం డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ప్రారంభమైంది. ఆయన డబ్బింగ్‌ చెప్పిన తొలిచిత్రం ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ నటించిన సంసారం అనే సినిమా. కొన్నాళ్ల తర్వాత బాలనటుడిగా కూడా అవకాశాలు వచ్చాయి.

బాలనటుడిగా సాయికుమార్‌ చేసిన తొలి సినిమా దేవుడు చేసిన పెళ్లి. అందులో ఆయన అంధుడిగా నటించారు. ఆ తర్వాత దర్శకుడు మధుసూదన్‌రావు తెరకెక్కించిన జేబు దొంగ సినిమాలో నటించారు. ముందుగా కన్నడ చిత్రాలలో కథానాయకుడిగా నటించిన తర్వాత తెలుగు సినిమాలలో నటించారు.

Whats_app_banner