Vidrohi Movie: టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రవి ప్రకాష్ పేరు చెప్పగానే పోలీస్ పాత్రలే గుర్తొస్తాయి. సిల్వర్ స్క్రీన్‌పై ఎక్కువగా ఖాకీ డ్రెస్‌లోనే కనిపించాడు. మరోసారి పోలీస్ పాత్రలో రవిప్రకాష్ నటిస్తోన్న మూవీ విద్రోహి. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు వీఎస్ వీ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో శ్రీకాంత్ విద్రోహి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ - విద్రోహి సినిమాలో రవి ప్రకాష్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అతడు నాకు మంచి మిత్రుడు. టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. ఈ సినిమా స్టోరీ నాకు తెలుసు. రవిప్రకాష్ కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలుస్తుందనే నమ్మకముంది" అని అన్నారు. “డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా విద్రోహి తెలుగు ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. గతంలో నేను చేసిన పోలీస్ క్యారెక్టర్స్‌కు భిన్నంగా ఇందులోని పాత్ర సాగుతుంది” అని యాక్టర్ రవి ప్రకాష్ చెప్పాడు.
దర్శకుడు వీఎస్ వీ మాట్లాడుతూ - విద్రోహి మూవీలో రవిప్రకాష్, శివ కుమార్ పాత్రలు పోటాపోటీగా సాగుతాయి. ఇప్పటివరకు టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై రాని సరికొత్త పాయింట్ తో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా విద్రోహి సినిమా ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం" అన్నారు. ఇందులో ఓ ఇంపార్టెంట్ రోల్ చేసినట్లు శివకుమార్ తెలిపాడు.
విద్రోహి మూవీలో తాగుబోతు రమేష్, మధునందన్, కోటేశ్వరరావు, జబర్దస్త్ బాబీ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.విజ్ఞాన వెంకట సుబ్రహ్మణ్యం, పప్పుల కనకదుర్గారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.
రవిప్రకాష్ ప్రధాన పాత్రలో నటించిన కోబలి వెబ్‌సిరీస్ ఇటీవల జియో హాట్ స్టార్‌లో రిలీజైంది. రివేంజ్ యాక్షన్ డ్రాగా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌లో కుటుంబ క్షేమం ఆరాటపడే యువకుడి పాత్రలో చక్కటి నటనతో మెప్పించాడు.
2000 ఏడాదిలో రిలీజైన శుభవేళ మూవీతో యాక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రవి ప్రకాష్. సుదీర్ఘ కెరీర్‌లో తెలుగు, తమిళ భాషల్లో కలిపి 200లకుపైగా సినిమాలు చేశాడు. జనతా గ్యారేజ్, కేశవ, దూకుడు, ప్రతినిధితో పాటు పలు తెలుగు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేశాడు. ఇటీవల డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజైన కాఫీ విత్ కిల్లర్ మూవీలోనూ పోలీస్ పాత్రలోనే కనిపించాడు. సినిమాలే కాకుండా చందరగం, 9 అవర్స్, కుడి ఎడమైతే వెబ్‌సిరీస్‌లలో రవి ప్రకాష్ నటించాడు.
సంబంధిత కథనం