Kobali: కోబలిలో చూసింది తక్కువే - సీజన్ 2లోనే అసలు కథ ఉంటుంది - తెలుగు వెబ్‌సిరీస్‌పై రవిప్రకాష్ కామెంట్స్
Kobali: కంటెంట్ బాగుంటే కొత్త, పాత అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని కోబలి సిరీస్ నిరూపించిందని సీనియర్ హీరో వెంకట్ అన్నాడు. రవిప్రకాష్, వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించిన కోబలి సిరీస్ ఇటీవల హాట్‌స్టార్‌లో రిలీజైంది. ఈ వెబ్‌సిరీస్ సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో జరిగాయి.

Kobali: తాను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయ్యిందని, కొత్తగా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోనే కోబలి చేశానని నటుడు రవి ప్రకాష్ అన్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన కోబలి వెబ్‌సిరీస్ ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజైంది. ఈ యాక్షన్ వెబ్‌సిరీస్‌కు రేవంత్ దర్శకత్వం వహించాడు. వెంకట్, రాకీసింగ్, తరుణ్ రోహిత్, శ్రీతేజ్, శ్యామల ముఖ్య పాత్రల్లో కనిపించారు.
ఫిబ్రవరి 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ వెబ్‌సిరీస్ రిలీజైంది. 7 భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్‌సిరీస్ హాట్ స్టార్‌లో ట్రెండింగ్‌లో ఉంది. కోబలి సక్సెస్ సెలబ్రేషన్స్ గురువారం హైదరాబాద్‌లో జరిగాయి.
కాఫీ షాప్‌లో కథ విన్నా...
ఈ వేడుకలో యాక్టర్ రవి ప్రకాష్ మాట్లాడుతూ “కాఫీ షాప్‌లో కోబలి కథ విన్నాను. నాకు నచ్చింది. అంతా కొత్తవాళ్లే. ఆడియెన్స్‌కు తెలిసిన ముఖం ఒక్కటి కూడా ఇందులో లేదు. అసలు ఈ సిరీస్ షూట్ చేస్తారా? రిలీజ్ అవుతుందా అనుకున్నా. నమ్మకంతో ముందుకు సాగాం. హానెస్ట్ గా పనిచేస్తే మంచి మంచి రిజల్ట్ ఉంటుందని ఈ సిరీస్ నిరూపించింది” అని అన్నాడు. కోబలి సీజన్ 2 లో వెంకట్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. అసలైన కథ అక్కడ మొదలవుతుంది. ఫస్ట్ సీజన్ జస్ట్ ట్రైలరే లాంటిదే అని రాకీ సింగ్ తెలిపాడు. .
ఏడు భాషల్లో..,.
సీనియర్ హీరో వెంకట్ మాట్లాడుతూ.. “ఈ వెబ్‌సిరీస్‌లో నటించిన వాళ్లందరూ కొత్తవాళ్లే. హాట్ స్టార్ న్యూ టాలెంట్‌ను నమ్మింది. . 7 భాషల్లోనూ ఇది మంచి విజయాన్ని అందుకుంది.స్టార్లు ఉంటేనే కంటెంట్ ని ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది పాత మాట. ఇప్పుడు కాలం మారింది.కంటెంట్ బాగుంటే కొత్త పాత తేడా లేదు అని ప్రేక్షకులు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఈ సిరీస్‌లో నాది చిన్న పాత్రే. కానీ కథ నచ్చి చేశా” అని తెలిపాడు. కోబలి' మేము ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్ అయ్యిందని, నార్త్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుందని నిర్మాతలు పేర్కొన్నారు.
సీజన్ 2
దర్శకుడు రేవంత్ మాట్లాడుతూ… “కోబలి వెబ్‌సిరీస్‌కు మేము అనుకున్నదానికంటే మంచి రీచ్ వచ్చింది. సీజన్ 2 మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ ఏడాదే సీజన్2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అని చెప్పాడు.
సంబంధిత కథనం