Actor Rajendra Prasad: అది నా అదృష్టం.. కూతురు మరణం తర్వాత మొదటి సారి మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్-actor rajendra prasad comments first time after his daughter gayatri death in laggam movie pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Actor Rajendra Prasad: అది నా అదృష్టం.. కూతురు మరణం తర్వాత మొదటి సారి మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్

Actor Rajendra Prasad: అది నా అదృష్టం.. కూతురు మరణం తర్వాత మొదటి సారి మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్

Sanjiv Kumar HT Telugu
Oct 24, 2024 11:27 AM IST

Actor Rajendra Prasad About Laggam Movie: కూతురు మరణం తర్వాత మొదటిసారి సినిమా ఫంక్షన్‌లో నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. తాజాగా జరిగిన లగ్గం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా గురించి చెబుతూ తన కూతురు గాయత్రి విడిచిపెట్టి వెళ్లిపోయిందని రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు.

అది నా అదృష్టం.. కూతురు మరణం తర్వాత మొదటి సారి మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్
అది నా అదృష్టం.. కూతురు మరణం తర్వాత మొదటి సారి మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్

Actor Rajendra Prasad Comments: సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో అచ్చ తెలుగు టైటిల్‌తో ఫన్ అండ్ ఎమోషనల్ చిత్రంగా తెరకెక్కిన సినిమా లగ్గం. ఈ సినిమాకు దర్శకుడు రమేశ్ చెప్పాల దర్శకత్వం వహించారు. సాఫ్ట్‌వేర్ సంబంధాలు, వ్యవసాయం, నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవల విడుదలైన లగ్గం ట్రైలర్ అందరినీ బాగా ఆకట్టుకుంది.

yearly horoscope entry point

గ్రాండ్‌గా లగ్గం ప్రీ రిలీజ్ ఈవెంట్

లగ్గం మూవీలో సాయి రోనక్, ప్రగ్యా నగ్ర హీరో హీరోయిన్స్‌గా చేస్తున్నారు. వీరితోపాటు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, సప్తగిరి, రోహిణి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా లగ్గం సినిమా చాలా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా లగ్గం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.

నా కూతురు వదిలివెళ్లోపోయింది

లగ్గం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. "లగ్గం చిత్రం ఒక తండ్రీ కూతుళ్ల కథ. ఇటీవలే నా కూతురు నన్ను వదిలి వెళ్లిపోయింది" అంటూ రాజేంద్ర ప్రసాద్ చాలా భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం స్పీచ్‌ను మళ్లీ కొనసాగించారు.

47 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్

"నాది 47 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్. లాంగ్ ఇన్నింగ్స్. దర్శకుడు రమేష్ చెప్పాలతో మీ శ్రేయోభిలాషి చిత్రం నుంచి అనుబంధం ఉంది. ఆ చిత్రానికి ఆయన రచయితగా పనిచేశారు. నిర్మాత వేణు గోపాల్‌కి రిలీజ్‌కి ముందే నా కంగ్రాట్స్ చెబుతున్నా. ఎందుకంటే లగ్గం చిత్రంలో ఉన్న కంటెంట్ అలాంటిది. లగ్గం చిత్రంలో తెలంగాణ బిడ్డగా నటించడం నా అదృష్టం" అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

అమ్మలా వచ్చి

ఇదిలా ఉంటే, రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి అక్టోబర్ 4న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తన కూతురు అమ్మలా వచ్చి, మళ్లీ తనను వదిలి వెళ్లిపోయిందని ఎంతో కన్నీరుమున్నీరు అయ్యారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవితోపాటు ఇతర సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను కలిసి సంతాపం తెలియజేశారు.

కూతురు మరణం తర్వాత

కూతురు మరణం తర్వాత తొలిసారిగా ఇలీ మూవీ ఫంక్షన్‌లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. లగ్గం చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ చాలా కీ రోల్ ప్లే చేస్తున్నందునే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు అయి తన స్పీచ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక లగ్గం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజేంద్ర ప్రసాద్‌తోపాటు సప్తగిరి, రోహిణి, నిర్మాత, డైరెక్టర్ ప్రముఖులు హాజరు అయ్యారు.

లగ్గం నటీనటులు

లగ్గం చిత్రంలో సాయి రోనక్, ప్రజ్ఞ నగ్ర, రాజేంద్ర ప్రసాద్, రోహిణి, సప్తగిరితోపాటు ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చంద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి, కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, వివా రెడ్డి, సత్య ఏలేశ్వరం, అంజిబాబు, రాదండి సదానందం, కిరీటి, రవి వర్మ, తదితరులు నటించారు.

Whats_app_banner